పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు రెండువేల కిందట వైసీపీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ ప్రక్రియలో భాగంగా ప్రాథమిక అర్హత పరీక్షను అప్పట్లో ప్రభుత్వం పూర్తి చేసింది. ఆ తరువాత ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించి మెయిన్స్ నిర్వహించడం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసి ఉద్యోగాలు కేటాయించాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల ఈ ప్రక్రియలో జాప్యం ఏర్పడింది. దీంతో తాజాగా రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే చర్యలను చేపట్టింది.
పోలీస్ శాఖ
పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు రెండువేల కిందట వైసీపీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ ప్రక్రియలో భాగంగా ప్రాథమిక అర్హత పరీక్షను అప్పట్లో ప్రభుత్వం పూర్తి చేసింది. ఆ తరువాత ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించి మెయిన్స్ నిర్వహించడం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసి ఉద్యోగాలు కేటాయించాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల ఈ ప్రక్రియలో జాప్యం ఏర్పడింది. దీంతో తాజాగా రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే చర్యలను చేపట్టింది. అందులో భాగంగానే ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (ఎస్ఎల్పిఆర్బి)ప్రభుత్వం ప్రకటించింది. ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన 95,208 మందికి డిసెంబర్ చివరి వారంలో శారీరక దేహదారుడ్యపరీక్షలో నిర్వహించనున్నట్లు రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్ ప్రకటించారు. ఈ నెల 11 నుంచి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్లో పిఎంటి, పిఈటి పరీక్షల దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉండనున్నాయి. ఫిజికల్ మెజర్మెంట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లో పాల్గొనే అభ్యర్థులు ఈ నెల 21 సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
గత వైసిపి ప్రభుత్వ హయాంలో 6,500 చొప్పున పోస్టులను బట్టి చేస్తామని చెప్పి 2022 నవంబర్లో నోటిఫికేషన్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 4.58 లక్షల మంది ఉద్యోగాలు దరఖాస్తు చేసుకోగా 2023 జనవరి చివరి వారంలో ప్రిలిమ్స్ నిర్వహించారు ఫిబ్రవరి 5న వెలువడిన ఫలితాల్లో 9528 మంది అర్హత సాధించినట్లు పిఆర్బి ప్రకటించింది. మార్చి 13 నుంచి 20 వరకు దేహదారుడ్య పరీక్షలు నిర్వహిస్తామని హాల్ టికెట్లు జారీ చేసింది. అదే సమయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో ఈ ప్రక్రియను వాయిదా వేసింది. అదే సమయంలో కొందరు హోంగార్డులు కోర్టులో కేసు వేశారు. దీంతో ఎన్నడూ లేని విధంగా సివిల్ పోలీసులో 15 శాతం, ఏపీఎస్పీలో 25 శాతం రిజర్వేషన్లను వైసీపీ ప్రభుత్వం ఇచ్చింది. అలాగే, తమకు కటాఫ్ తగ్గించాలంటూ కొందరు హోంగార్డులు కోర్టును ఆశ్రయించడంతో నియామక ప్రక్రియ ఆగిపోయింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అభ్యర్థులు ఈ విషయాన్ని సర్కార్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సీఎం చంద్రబాబు.. హోం మంత్రి, డిజిపి, పిఆర్బి చైర్మన్, అడ్వకేట్ జనరల్ తో సమీక్షించారు. న్యాయపరమైన చిక్కులు తొలగించేలా చూడాలని ఆదేశించడంతో నియామక ప్రక్రియ ముందుకు కదిలింది. ప్రభుత్వ ప్రకటన పట్ల అభ్యర్థులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లుగా నిరీక్షిస్తున్న తమకు శుభవార్తను ప్రభుత్వం అందించిందంటూ పేర్కొంటున్నారు.