ఓటరు ఐడీతో ఆధార్‌ అనుసంధానానికి గ్రీన్‌ సిగ్నల్‌.. షురూ కానున్న ప్రక్రియ.!

ఓటర్‌ కార్డుతో ఆధార్‌ను అనుసంధానించే ప్రక్రియ దేశంలో ప్రారంభం కానుంది. దేశంలో ఓటింగ్‌లో జరుగుతున్న అవకతవకలను నియంత్రించేందుకు ఓటరు కార్డుకు ఆధార్‌ అనుసంధానం చేయాలన్న డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. అయితే, దీనిపై ఎన్నికల సంఘం ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. తాజాగా ఓటర్‌ ఐడీతో ఆధార్‌ను అనుసంధానించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ప్రక్రియ ప్రారంభం కానుంది. కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఉన్నతాధికారులతో ఎన్నికల సంఘం అధికారులు సమావేశమై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

ఓటర్‌ కార్డుతో ఆధార్‌ను అనుసంధానించే ప్రక్రియ దేశంలో ప్రారంభం కానుంది. దేశంలో ఓటింగ్‌లో జరుగుతున్న అవకతవకలను నియంత్రించేందుకు ఓటరు కార్డుకు ఆధార్‌ అనుసంధానం చేయాలన్న డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. అయితే, దీనిపై ఎన్నికల సంఘం ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. తాజాగా ఓటర్‌ ఐడీతో ఆధార్‌ను అనుసంధానించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ప్రక్రియ ప్రారంభం కానుంది. కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఉన్నతాధికారులతో ఎన్నికల సంఘం అధికారులు సమావేశమై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. దీనిపై సాంకేతిక నిపుణులతో సంప్రదింపులు చేపడతామని కేంద్రం వెల్లడించింది. ఆర్టికల్‌ 326, ప్రజాప్రతినిధులు చట్టం-1950, సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పులను అనుసరించి ఓటర్‌ గుర్తింపు కార్డులను ఆధార్‌ కార్డుతో అనుసంధానం చేసేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో యూఏఐడీ, ఈసీఐ మధ్య సాంకేతికపరమైన అంశాలపై త్వరలో చర్చించనుంది. 

దేశంలోని ప్రతి పౌరుడు తన ఆధార్‌ కార్డును ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలకు అనుసంధానం చేశాడు. పాన్‌ కార్డుతో కూడా ఆధార్‌ అనుసంధానం చేసుకున్నారు. ఆధార్‌ కార్డును ఓటర్‌ గుర్తింపు కార్డుతో అనుసంధానం చేయాలంటూ డిమాండ్‌ వినిపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ మేరకు ర్యలు చేపడుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఎప్పటికప్పుడు ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. ఆధార్‌తో అనుసంధానం చేయకపోవడం వల్ల నకిలీ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నకిలీ ఓటర్ల సమస్యకు చెక్‌ చెప్పేందుకు ఆధార్‌ కార్డుతో ఓటరు కార్డును అనుసంధానం చేసే ప్రక్రియ దోహదపడుతుందని పలువురు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం దీనికి సిద్ధపడింది. ఎన్నికల సంఘాన్ని ఈ మేరకు చర్యలు చేపట్టాలని కోరడంతో ప్రక్రియ ప్రారంభిస్తున్నారు. కొద్దిరోజుల్లోనే దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమవుతుందని చెబుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్