తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

ఇవాళ(గురువారం) చివరి రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళలంతా ఒక్కచోట చేరి ఆడిపాడుతూ సంబురాలు చేసుకుంటున్నారు. మహిళలంతా తీరొక్క పువ్వులతో భక్తి శ్రద్ధలతో బతుకమ్మను పేర్చారు.

Bathukamma celebrations Telangana

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే బతుకమ్మ వేడుకలురాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ(గురువారం) చివరి రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళలంతా ఒక్కచోట చేరి ఆడిపాడుతూ సంబురాలు చేసుకుంటున్నారు. మహిళలంతా తీరొక్క పువ్వులతో భక్తి శ్రద్ధలతో బతుకమ్మను పేర్చారు. బతుకమ్మ సంబురాలతో హైదరాబాద్లోని ట్యాంక్బండ్ పరిసరాలు వెలుగులీనుతున్నాయి. 

రాష్ట్ర వ్యాప్తంగా 9 రోజులుగా ఘనంగా సాగుతున్న బతుకమ్మ సంబురాలు ఇవాళ్టితో  ముగియనున్నాయి.  ఈ క్రమంలోనే సాయంత్రం హైదరాబాద్ ట్యాంక్‌బండ్ దగ్గర ప్రభుత్వం ఆధ్వర్యంలో అంబరాన్నంటేలా బతుకమ్మ సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సంబురాల్లో ఏకంగా 10 వేల మంది మహిళలు పాల్గొన్నట్లు తెలుస్తోంది.. ఈ సందర్భంగా వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

మరోవైపు  హనుమకొండ పద్మాక్షి అమ్మవారి గుండం వేలాది మంది మహిళలతో కిక్కిరిసిపోయింది. వికారాబాద్ జిల్లా తాండూరులో మహిళలు భక్తి శ్రద్ధలతో బతుకమ్మ ఆడారు. కరీంనగర్, నల్గొండ, అదిలాబాద్ తదితర జిల్లాల్లో బతుకమ్మ సంబరాలు కోలాహలంగా సాగుతున్నాయి. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన ఈ సంబురాలు నేటితో ముగియనున్నాయి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్