తెలంగాణలో వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలు వెల్లడించేందుకు గ్రామ సభలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. కలెక్టర్ల సమావేశంలో ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి తన నిర్ణయాన్ని వెల్లడించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కూడా ఇదే తరహాలో వార్డు, డివిజన్ సభలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా పథకాల కోసం అర్హుల ఎంపికకు సేకరించిన వివరాలు, రూపొందించిన జాబితాలను ఆ సభలోనే ప్రకటించాలని సీఎం స్పష్టం చేశారు. ఈ నెల 15వ తేదీలోగా ఈ పథకాల అమలుకు కావాల్సిన సన్నాహక ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. జిల్లా ఇన్చార్జి మంత్రుల సారధ్యంలో అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, మోడల్ అధికారులతో సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలు వెల్లడించేందుకు గ్రామ సభలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. కలెక్టర్ల సమావేశంలో ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి తన నిర్ణయాన్ని వెల్లడించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కూడా ఇదే తరహాలో వార్డు, డివిజన్ సభలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా పథకాల కోసం అర్హుల ఎంపికకు సేకరించిన వివరాలు, రూపొందించిన జాబితాలను ఆ సభలోనే ప్రకటించాలని సీఎం స్పష్టం చేశారు. ఈ నెల 15వ తేదీలోగా ఈ పథకాల అమలుకు కావాల్సిన సన్నాహక ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. జిల్లా ఇన్చార్జి మంత్రుల సారధ్యంలో అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, మోడల్ అధికారులతో సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ 24వ తేదీలోగా గ్రామ సభలు పూర్తి చేయాలని ఆదేశించింది. ఒక వ్యక్తికి ఒకే చోట రేషన్ కార్డు ఉండాలని, వేర్వేరు ప్రాంతాల్లో ఉండే విధానానికి స్వస్తి పలకాలని ప్రభుత్వం ఆదేశించింది. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా పథకం వర్తించేలా చూడాలని స్పష్టం చేసింది. వ్యవసాయానికి అవసరమైన భూములు జాబితా వెల్లడించేందుకు ముందు అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలించే ధ్రువీకరించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఈ నెల 26 తర్వాత తాను జిల్లాల్లో పర్యటించనున్నట్లు సీఎం వెల్లడించారు. ఆకస్మిక తనిఖీలు ప్రభుత్వ వ్యవస్థలో ఎక్కడ నిర్లక్ష్యం కనిపించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. క్షేత్రస్థాయి అధికారులు కూడా అప్రమత్తం చేయాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. ఇదిలా ఉంటే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల తదితర పథకాల అమలు, ఆయా పథకాలకు అవసరమైన వివరాల సేకరణ, అర్హుల జాబితాల తయారీ తదితర అంశాలపై ప్రత్యేకంగా సీఎం దృష్టి సారించి ఆకస్మిక తనిఖీల్లో వీటికి సంబంధించి వివరాలను అధికారులను అడిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మహిళ ఐఏఎస్ అధికారులతోపాటు ఐపీఎస్ అధికారులు కూడా నెలలో ఒక్కసారైనా బాలికల వసతి గృహాలను సందర్శించాలని సీఎం ఆదేశించారు. అక్కడే రాత్రి బస చేయాలని సూచించారు. విద్యార్థుల అవసరాలను వారి సమస్యలను తెలుసుకునే పరిష్కరించాలని సూచించారు.
అలాగే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ నెల 26న జరిగే గణతంత్ర వేడుకలకు ప్రాధాన్యత ఉంది. దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ప్రతిష్టాత్మక పథకాల అమలకు ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టాలన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతు భరోసాను ఎకరాకు రూ.12 వేలకు పెంచడంతోపాటు భూమి లేని నిరుపేద కూలీలకు రూ.12,500 సాయం అందించే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేస్తామని, దీనికి ఏర్పాట్లు చేయాలని అధికారులు సూచించారు. గతంలో రైతుబంధు పేరిట భారీగా ప్రజాధనం దుర్వినియోగమైన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు తెలియజేశారు. గత ప్రభుత్వం వ్యవసాయ యోగ్యం కాని భూములకు పంట పెట్టుబడి సాయం అందించిందని, ఈ తరహా పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు ఉన్నత స్థాయి నుంచి ఆదేశాలు అందాయి. అలాగే గడిచిన కొన్నాళ్లుగా కొత్త రేషన్ కార్డులు కోసం ఎదురుచూస్తున్న నిరుపేదలకు రేషన్ కార్డులు మంజూరు చేయడంతోపాటు ఇందిర మహిళను మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. గతంలో ఉన్న అర్హత నిబంధనలు ప్రకారమే రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. ఒక వ్యక్తికి ఒకే చోట రేషన్ కార్డు ఉండేలా పటిష్ట చర్యలు చేపడుతున్నారు. వేరువేరు ప్రాంతాల్లో ఉండకుండా జాగ్రత్తలను తీసుకుంటున్నారు. వన్ రేషన్ వన్ స్టేట్ విధానాన్ని తీసుకురాబోతున్నట్లు సీఎం ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే ఇందిరమ్మ యాప్ ద్వారా గుర్తించిన 18.32 లక్షల మందికి ఇళ్లను కట్టించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా అత్యంత నిరుపేదలను గుర్తించి వారికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నియోజకవర్గానికి 3500 ఇళ్లను మంజూరు చేయనున్నారు. మహిళలకు అర్హులైన వారి జాబితాలను వెంటనే సిద్ధం చేయాలని ప్రభుత్వం నుంచి ఇప్పటికే జిల్లా కలెక్టర్లతోపాటు సీఎం నుంచి ఇన్చార్జి మంత్రులకు సమాచారాన్ని అందించారు. జిల్లా ఇన్చార్జి మంత్రులు ఆమోదంతో ఈ అర్హుల జాబితాను గ్రామ సభల్లో ప్రదర్శించాల్సి ఉంటుంది.