గూగుల్‌ వెర్సస్‌ వాట్సాప్‌.. సరికొత్త ట్రాన్సిలేటర్‌ను తెస్తున్న వాట్సాప్‌

ప్రముఖ మెసేజింగ్‌, వీడియో కాలింగ్‌ యాప్‌ వాట్సాప్‌ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను వినియోగదారులకు అందిస్తుంది. విభిన్నమైన ఫీచర్లను తీసుకువస్తూ వినియోగదారులకు సరికొత్త అనుభూతిని ఈ సంస్థ కలిగిస్తుంది. యూజర్లను అట్రాక్ట్‌ చేయడానికి ఈ కొత్త ఫీచర్లు ఎంతగానో ఉపయోగపడుతుంటాయి. ఈ క్రమంలోనే మెటా కంపెనీ మరో సరికొత్త టూల్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే వాట్సాప్‌ ప్రస్తుతం ఈ మేసెజ్‌ ట్రాన్స్‌లేషన్‌ టూల్‌ను బీటా వెర్షన్‌లోకి అందుబాటులోకి తెచ్చింది. ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ 2.25.12.25 కోసం ఈ టూల్‌ను టెస్ట్‌ చేస్తున్న వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్‌ తాజాగా ఒక పోస్టులో హైలెట్‌ చేసింది.

 symbolic image

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ మెసేజింగ్‌, వీడియో కాలింగ్‌ యాప్‌ వాట్సాప్‌ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను వినియోగదారులకు అందిస్తుంది. విభిన్నమైన ఫీచర్లను తీసుకువస్తూ వినియోగదారులకు సరికొత్త అనుభూతిని ఈ సంస్థ కలిగిస్తుంది. యూజర్లను అట్రాక్ట్‌ చేయడానికి ఈ కొత్త ఫీచర్లు ఎంతగానో ఉపయోగపడుతుంటాయి. ఈ క్రమంలోనే మెటా కంపెనీ మరో సరికొత్త టూల్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే వాట్సాప్‌ ప్రస్తుతం ఈ మేసెజ్‌ ట్రాన్స్‌లేషన్‌ టూల్‌ను బీటా వెర్షన్‌లోకి అందుబాటులోకి తెచ్చింది. ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ 2.25.12.25 కోసం ఈ టూల్‌ను టెస్ట్‌ చేస్తున్న వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్‌ తాజాగా ఒక పోస్టులో హైలెట్‌ చేసింది. ఈ టూల్‌ వాడాలంటే ముందుగా లాంగ్వేజ్‌ ప్యాక్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత కావాల్సిన భాషలో ట్రాన్స్‌లేషన్‌ మెసేజ్‌ పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ మెసేజ్‌లు ఎంతో సురక్షితంగా, ఎన్‌క్రిప్ట్‌ చేసి ఉంటాయి. వాట్సాప్‌ సర్వర్‌లో ఈ రికార్డులు ఉండవు. ఈ మేసేజ్‌ ట్రాన్స్‌లేషన్‌ టూల్‌ను వాట్సాప్‌ 2024 నుంచే టెస్టింగ్‌ చేస్తున్నట్టు వాట్సాప్‌ బీటా ఇన్నో వెల్లడించింవది. అంటే కొద్దిరోజుల్లోనే ఈ ఫీచర్‌ వాట్సాప్‌ యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది ఎలా పని చేస్తుందన్న దానిపైనా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వాట్సాప్‌ ప్రొఫైల్‌ సెక్షన్‌లో ఈ కొత్త ఫీచర్‌ను యాడ్‌ చేయనున్నట్టు తెలుస్తోంది. డీఫాల్ట్‌గా ఈ మెసేజ్‌ ట్రాన్స్‌లేషన్‌ ఫీచర్‌ డిజేబుల్‌ అయి ఉంటుంది.

చాట్స్‌ను ట్రాన్స్‌లేట్‌ చేసుకోవలనుకుంటే ప్రొఫైల్‌ సెక్షన్‌లోకి వెళ్లి ఫీచర్‌ను ఎనేబుల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగానే దీనిపై క్లిక్‌చేయగానే లాంగ్వేజ్‌ ఆప్షన్స్‌ చూపిస్తుంది. మీకు కావాల్సిన భాషను ఎంచుకుని వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఒకసారి లాంగ్వేజ్‌ ప్యాక్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకుఆన్న చాట్‌పై క్లిక్‌ చేసి త్రీ డాట్‌ మెనూను ఎంచుకోవాలి. ఇప్పుడు ట్రాన్స్‌లేషన్‌ ఆప్షన్స్‌ చూపిస్తాయి. ఒరిజినల్‌ మెసేజ్‌తోపాటు ట్రాన్స్‌లేట్‌ అయిన మెసేజ్‌లను వాట్సాప్‌ చూపిస్తుంది. ఒకసారి ట్రాన్సలేషన్‌ చాట్‌ను ఎనేబుల్‌ చేసుకుని వాడుకున్న తరువాత డిసేబుల్‌ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస్తే మిగిలిన ట్రాన్స్‌లేషన్‌ యాప్స్‌, టూల్స్‌తో పనేమీ ఉండదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కోట్లాది మంది యూజర్లు గూగుల్‌ ట్రాన్స్‌లేటర్‌కు ఇది పోటీని ఇస్తుందని చెబుతున్నారు. వాట్సాప్‌లోనే అన్ని రకాల భాషల మేసేజ్‌లను ట్రాన్స్‌లేట్‌ చేసుకోవడం ద్వారా సమయం కూడా ఎక్కువగా ఆదా అవుతుందని అంటున్నారు. థర్డ్‌ పార్టీ ట్రాన్స్‌లేషన్‌ యాప్స్‌ను మెయింటేన్‌ చేసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. వాట్సాప్‌ గతంలో వాయిస్‌ నోట్స్‌ ట్రాన్స్‌స్కైబ్‌ ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. వాయిస్‌ నోట్స్‌ ప్లే అవుతుండగా చాట్‌ విండోలో టెక్ట్స్‌ రూపంలో వచ్చేది. ఇప్పుడు నేరుగా మెసేజ్‌లను ట్రాన్స్‌లేట్‌ చేసుకునే అవకాశం కలుగుతుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్