ఉచితంగా మెషిన్ లెర్నింగ్ కోర్సు నేర్పించనున్న గూగుల్.. వీరికి మాత్రమే.!

ప్రముఖ సెర్చ్ ఇంజన్ కంపెనీ గూగుల్ సంస్థ ఉచితంగా మిషన్ లెర్నింగ్ కోర్సు నేర్పించనుంది. టెక్నాలజీ నేర్చుకోవాలనుకునే వారి కోసం ఈ ప్రత్యేక కోర్సును గూగుల్ సంస్థ ఆఫర్ చేస్తోంది. మెషిన్ లెర్నింగ్ క్రాస్ కోర్స్ (mlcc) అనే ఉచిత ఆన్లైన్ కోర్సును గూగుల్ సంస్థ తాజాగా ప్రవేశపెట్టింది. ఈ కోర్సు డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI) ఇంజనీరింగ్ నేర్చుకోవాలనుకునే స్టూడెంట్స్, గ్రాడ్యుయేట్స్, ప్రొఫెషనల్ స్కూల్ అనుకూలంగా ఈ కోర్సు ఉండనుంది. మిషన్ లెర్నింగ్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఒక ప్రధాన భాగం. దీని ద్వారా కంప్యూటర్లు ప్రోగ్రామింగ్ లేకుండా డేటా నుంచి నేర్చుకుంటాయి.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ సెర్చ్ ఇంజన్ కంపెనీ గూగుల్ సంస్థ ఉచితంగా మిషన్ లెర్నింగ్ కోర్సు నేర్పించనుంది. టెక్నాలజీ నేర్చుకోవాలనుకునే వారి కోసం ఈ ప్రత్యేక కోర్సును గూగుల్ సంస్థ ఆఫర్ చేస్తోంది. మెషిన్ లెర్నింగ్ క్రాస్ కోర్స్ (mlcc) అనే ఉచిత ఆన్లైన్ కోర్సును గూగుల్ సంస్థ తాజాగా ప్రవేశపెట్టింది. ఈ కోర్సు డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI) ఇంజనీరింగ్ నేర్చుకోవాలనుకునే స్టూడెంట్స్, గ్రాడ్యుయేట్స్, ప్రొఫెషనల్ స్కూల్ అనుకూలంగా ఈ కోర్సు ఉండనుంది. మిషన్ లెర్నింగ్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఒక ప్రధాన భాగం. దీని ద్వారా కంప్యూటర్లు ప్రోగ్రామింగ్ లేకుండా డేటా నుంచి నేర్చుకుంటాయి. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అనేక రంగాల్లో విరువగా ఉపయోగిస్తున్నారు. విస్తృతంగా వినియోగిస్తున్న ఈ టెక్నాలజీ పై మరింతమందికి శిక్షణ ఇచ్చే ఉద్దేశంతో గూగుల్ సంస్థ ఈ కోర్సు రూపకల్పనకు సిద్ధపడింది. స్టాక్ మార్కెట్ ట్రెండ్స్ చెప్పడం, మెడికల్ డయాగ్నోసిస్లు, యూట్యూబ్, నెట్ఫ్లిక్స్ అంటే స్ట్రీమింగ్ సర్వీసులలో వీడియోలు ఇంకా సినిమాలు రికమెండ్ చేయడం వంటి అనేక అప్లికేషన్లలో ఇవి కీలకపాత్ర పోషిస్తున్నాయి. 

ఈ కోర్సు నేర్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది. కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ చదువుతున్న విద్యార్థులకు ఈ కోర్సు బాగా ఉపయోగపడుతుంది. మిషన్ లెర్నింగ్ గురించి మరింత జ్ఞానం పెంచుకోవాలనుకునే వారు కూడా ఈ కోర్సులో చేరవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీల్డ్ లో కెరియర్ను అభివృద్ధి చేసుకోవాలనుకునే వారు, ప్రాక్టికల్ గా నేర్చుకోవాలనుకునే వారు కూడా ఈ కోర్సును ఎంచుకోవచ్చు. ఈ కోర్సులో మీరు మెషిన్ లెర్నింగ్ కు సంబంధించిన ముఖ్యమైన అంశాలను దసలవారీగా నేర్చుకుంటారు. ఈ కోర్సును మొత్తం మూడు ప్రధాన విభాగాలపై నేర్పించనున్నారు. ఇందులో మొదటిది మెషిన్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్ లో సూపర్వైజ్డ్, అన్ సూపర్వైజ్డ్, రీన్ ఫోర్స్ మెంట్ లెర్నింగ్ లో ఉంటుంది. అలాగే డేటా ఫ్రీ ప్రాసెసింగ్ అండ్ ఫ్యూచర్ ఇంజనీరింగ్ రెండో దశలో ఉంటుంది. ఇందులో డేటాను ఎలా సిద్ధం చేయాలో, ఎలాంటి టెక్నిక్స్ వినియోగించాలో నేర్పిస్తారు. మూడో దశలో ఆల్గారిధమ్స్ అండ్ మోడల్ సెలక్షన్ నేర్పిస్తారు. ఇందులో డెసిషన్ ట్రీస్, న్యూరల్ నెట్వర్, డీప్ లెర్నింగ్ వంటి అంశాలు నేర్పించనున్నారు.

చివరి దశలో రియల్ వరల్డ్ అప్లికేషన్ కు సంబంధించిన అంశాలు నేర్పిస్తారు. ఇమేజ్ రికగ్నేషన్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఆటోమేషన్ వంటి వాటిలో మెషిన్ లెర్నింగ్ ఎలా ఉపయోగపడుతుందో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కోర్సుల్లో పూర్తిచేసిన ప్రాజెక్టు పోర్టు పోలియోలో చేర్చుకోవచ్చు. ఈ స్కిల్స్ ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతరులతో కూడా పంచుకోవచ్చు. గూగుల్ ఏఐ ఎక్స్పర్ట్స్, ఇంజనీర్స్ మీకు అత్యుత్తమమైన ఎడ్యుకేషన్ అందించనున్నారు. మెషిన్ లెర్నింగ్ రంగంలో ట్రెండింగ్ అయిన టెక్నిక్స్ను బోధిస్తారు. ఈ కోర్సు పూర్తి చేసి గూగుల్ నుంచి సర్టిఫికెట్ పొందవచ్చు. దీనివల్ల మార్కెట్లో మంచి జాబ్ అవకాశాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ కోర్సులో చేరాలంటే ముందుగా గూగుల్ అఫీషియల్ వెబ్సైటుకు వెళ్లాలి. అక్కడకు వెళ్ళిన తర్వాత కోర్స్ కోసం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. గూగుల్ అకౌంట్ తో సైన్ అప్ అవడం ద్వారా ఈ కోర్సులో చేరవచ్చు. సైన్ అప్ చేసిన తర్వాత కోర్సు మెటీరియల్స్ (వీడియో లెక్చర్, అసైన్మెంట్స్, ప్రాజెక్ట్స్) సులభంగా చూడవచ్చు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్