ఐఐటీ ఖరగ్‌పూర్‌ నుంచి గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌కు గౌరవ డాక్టరేట్‌

దేశంలోని ప్రముఖ విద్యా సంస్థ ఐఐటీ ఖరగ్‌పూర్‌ నుంచి గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ గౌరవ డాక్టరేట్‌ అందుకున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో ఇటీవల జరిగిన కార్యక్రమంలో ఐఐటీ డైరక్టర్‌ వీకే తివారీ, విద్యా సంస్థకు చెందిన ఇతర ప్రతినిధులు సమక్షంలో ఆనరరీ డాక్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ను అందించారు. ఈ విషయాన్ని స్వయంగా సుందర్‌ పిచాయ్‌ సోషల్‌ మీడియాలో వెల్లడిస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు. తన పూర్వ సంస్థ ఐఐటీ ఖరగ్‌పూర్‌ నుంచి గౌరవ డాక్టరేట్‌ అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. తాను డాక్టరేట్‌ పొందాలన్నది తల్లిదండ్రుల ఎప్పుడూ ఆశ పడేవారన్నారు.

Google CEO Sundar Pichai

గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌

దేశంలోని ప్రముఖ విద్యా సంస్థ ఐఐటీ ఖరగ్‌పూర్‌ నుంచి గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ గౌరవ డాక్టరేట్‌ అందుకున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో ఇటీవల జరిగిన కార్యక్రమంలో ఐఐటీ డైరక్టర్‌ వీకే తివారీ, విద్యా సంస్థకు చెందిన ఇతర ప్రతినిధులు సమక్షంలో ఆనరరీ డాక్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ను అందించారు. ఈ విషయాన్ని స్వయంగా సుందర్‌ పిచాయ్‌ సోషల్‌ మీడియాలో వెల్లడిస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు. తన పూర్వ సంస్థ ఐఐటీ ఖరగ్‌పూర్‌ నుంచి గౌరవ డాక్టరేట్‌ అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. తాను డాక్టరేట్‌ పొందాలన్నది తల్లిదండ్రుల ఎప్పుడూ ఆశ పడేవారన్నారు. ఐఐటీలో తాను నేర్చుకున్న విద్య, సాంకేతికతే గూగుల్‌ వరకు తీసుకువచ్చిందన్నారు. టెక్నాలజీని మరింత ఎక్కువ మందికి అందించే స్థాయికి చేర్చినందుకు తన ఎంతో ఆనందంగా ఉందన్నారు. మరోసారి తన విద్యా సంస్థలో గడిపే అవకాశం వచ్చినందుకు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పిచాయ్‌ పోస్ట్‌ చేశారు. పిచాయ్‌తోపాటు ఆయన సతీమణి అంజాలి కూడా ఐఐటీ ఖరగ్‌పూర్‌ నుంచి పురస్కారాన్ని అందుకున్నారు. కెమికల్‌ ఇంజనీరింగ్‌లో ఆమె సాధించిన విజయాలకుగాను వశిష్ట పూర్వ విద్యార్థి అవార్డును విద్యాసంస్థ ప్రతినిధులు అందించారు. కార్యక్రమంలో పిచాయ్‌ తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. భారత-అమెరికన్‌ అయిన సుందర్‌ పిచాయ్‌ ఐఐటీ ఖరగ్‌పూర్‌ నుంచి బీటెక్‌ పూర్తి చేశారు. ఆ తరువాత అమెరికా వెళ్లి స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్‌ అండ్‌ మెటీరియల్‌ సైన్స్‌లో ఎంఎస్‌ పూర్తి చేశారు. 2004లో గూగుల్‌లో చేరి 2015లో కంపెనీ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. ఐఐటీలో చదువుతుండగానే తన క్లాస్‌మేట్‌ అంజలిని ప్రేమించి ఆ తరువాత వివాహం చేసుకున్నారు. గడిచిన తొమ్మిదేళ్లుగా గూగుల్‌ సీఈవోగా కొనసాగుతున్న ఆయన.. వినూత్నమైన పంథాలను సంస్థను అగ్రపథంలో ముందుకు నడిపిస్తున్నారు. సాంకేతికతకు అనుగుణంగా వస్తున్న మార్పులను చేస్తూ పోటీ ప్రపంచంలో గూగుల్‌ అగ్రశ్రేణి సంస్థగా కొనసాగేలా చేయడంలో విశేషంగా కృషి చేస్తున్నారు. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్