బంగారం కొనుగోలు చేయాలనుకునే మహిళలకు, గోల్డ్ ప్రియులకు శుభవార్త. గడిచిన మూడు రోజులుగా బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాల నేపథ్యంలో మూడు రోజులుగా స్వల్పంగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. బులియన్ మార్కెట్లో బంగారం, వెండి కి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు ప్రకారం బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తుంటాయి.
బంగారం
బంగారం కొనుగోలు చేయాలనుకునే మహిళలకు, గోల్డ్ ప్రియులకు శుభవార్త. గడిచిన మూడు రోజులుగా బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాల నేపథ్యంలో మూడు రోజులుగా స్వల్పంగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. బులియన్ మార్కెట్లో బంగారం, వెండి కి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు ప్రకారం బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తుంటాయి. ఈ క్రమంలోనే ఒకసారి ధరలు పెరిగితే మరోసారి తగ్గుతుంటాయి. గడిచిన కొన్ని రోజులుగా తగ్గిన బంగారం వెండి ధరలు మళ్ళీ పెరుగుతుండడంతో వినియోగదారులు ఆందోళన చెందారు. అయితే మళ్లీ క్రమంగా ధరలు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి.
తగ్గిన ధరల ప్రకారం దేశంలోని ప్రధాన నగరాల్లో శనివారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.300 తగ్గగా తులం రూ.70,400 కు చేరింది. గడిచిన మూడు రోజుల్లోనే తులం బంగారం ధర రూ.1100 వరకు తగ్గింది. మరోవైపు 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 వరకు తగ్గడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.76,800 కు చేరింది. విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర కాస్త అధికంగా ఉంది. ఎక్కడ తులం బంగారం ధర 22 క్యారెట్లు రూ.70,550 పలుకుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.76,950 గా ఉంది. బంగారం బాటలోనే వెండి ధరలు తగ్గుతున్నాయి. ఢిల్లీలో కేజీ వెండి పై 1000 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.90,500 కు చేరింది. ముందు రోజు కూడా వేయి వరకు ధర తగ్గుముఖం పట్టింది.