విజయవాడ వరద బాధితులకు గుడ్ న్యూస్.. భారీగా ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభుత్వం

విజయవాడ వరద బాధితులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన బాధిత కుటుంబాలకు భారీగా ఆర్థిక సాయం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. వరదల వల్ల నష్టపోయిన వారికి ఒక్కో ఇంటికి రూ.25 వేల రూపాయలు పరిహారం ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. అంతేకాకుండా నష్టపోయిన పరిశ్రమలకు కూడా ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. ఆయా పరిశ్రమల టర్నోవర్ ను బట్టి సాయం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

Vijayawada completely submerged in floods

వరదలకు పూర్తిగా ముంపునకు గురైన విజయవాడ

విజయవాడ వరద బాధితులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన బాధిత కుటుంబాలకు భారీగా ఆర్థిక సాయం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. వరదల వల్ల నష్టపోయిన వారికి ఒక్కో ఇంటికి రూ.25 వేల రూపాయలు పరిహారం ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. అంతేకాకుండా నష్టపోయిన పరిశ్రమలకు కూడా ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. ఆయా పరిశ్రమల టర్నోవర్ ను బట్టి సాయం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. భారీ వర్షం వరదల కారణంగా ఇల్లు కోల్పోయిన వారికి ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇవ్వాలని నిర్ణయించింది. వరదకు ప్రభావితం అయిన ప్రతి ఇంటికి రూ.25 వేలు ఆర్థిక సాయం అందించనున్నారు. మొదటి ఫ్లోర్లో ఉండే వారికి రూ.10 వేలు,  ఇళ్లల్లోకి నీరు వచ్చిన వారికి రూ.10 వేలు, చిరు వ్యాపారులకు రూ.25 వేలు చొప్పున పరిహారం అందించనున్నారు. టూ వీలర్స్ దెబ్బ తిన్నవారికి రూ.3000, ఆటో వంటి మూడు చక్రాలు ఉండే వాహనాలకి రూ.10,000 చొప్పున నష్టపరిహారాన్ని అందించనున్నారు. బైక్ ఇన్సూరెన్స్, రిపేర్లకు సంబంధించి తొమ్మిది వేలకు పైగా క్లెయిమ్లు ఇప్పటికే పరిష్కరించినట్లు సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. బైక్ ఇన్సూరెన్స్, రిపేర్లకు సంబంధించి రూ.71 కోట్ల మేర క్లెయిమ్ లు చేశారని, అందుకు ఆరు కోట్లు చెల్లించామని, మరో ఆరు వేల క్లెయిమ్లు పెండింగ్ లో ఉన్నాయని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. చేనేత కార్మికులకు రూ.15,000, నష్టపోయిన సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల్లో రూ.40 లక్షల నుంచి 1.5 కోట్ల టర్నోవర్ ఉన్న వాటికి లక్ష, రూ.1.5 కోట్లకుపైగా టర్నోవర్ ఉన్న వాటికి రూ.1.5 లక్షలు ఇస్తామని చంద్రబాబు వెల్లడించారు.

కోళ్ల విషయంలో ఒక్కో కోడికి వంద రూపాయలు, కోళ్ల ఫారం షెడ్డు డ్యామేజ్ అయితే ఐదు వేలు, ఎద్దులకు రూ40,000, దూడలకు రూ.25,000, గొర్రెలకు రూ.7500, ఎడ్ల బండి కోల్పోతే వారికి కొత్తవి అందిస్తామని సీఎం ప్రకటించారు. పంట నష్టపోయిన వారికి ఒక హెక్టార్ పత్తికి రూ.25000,  వేరు శనగకు రూ.15,000, హెక్టార్ ఫిషింగ్ ఫామ్ డిసిల్టేషన్, రెస్ట్రేషన్ కు రూ.15,000, పసుపు, అరటికీ రూ.35,000, మొక్కజొన్న, కొర్ర, రాగులు హెక్టార్ కు రూ.15,000 ప్రభుత్వం అందించనుంది. మత్స్యకారుల విషయంలో ఫిషింగ్ బోటు, వలలు పాక్షికంగా దెబ్బతింటే తొమ్మిది వేలు,  పూర్తిగా దెబ్బతింటే రూ.20,000 అందించనున్నారు. సేరి కల్చర్ కు రూ.6000, గేదెలకు రూ.50,000, వరి ఎకరాకు రూ.10,000, చెరకు రూ.25,000 చొప్పున నష్టపరిహారం అందించనున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం ఆయా ఇళ్లల్లో అద్దెకు ఉంటున్న వారికి మాత్రమే చెందుతుంది. ఇంటి యజమానికి ఆర్థిక సాయం చెందబోదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ ఇల్లు దెబ్బతింటే ఆ యజమానిని పరిగణలోకి తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది. పంట పొలాలకు ఇచ్చే పరిహారం విషయంలో కూడా కౌలుకు చేస్తున్న రైతులకు మాత్రమే నష్టపరిహారం అందించనున్నారు. నిజంగా నష్టపోయిన వారికి మాత్రమే మేలు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. కొద్దిరోజుల్లోనే బాధితులకు ఈ మేరకు నష్టపరిహారాన్ని అందిస్తామని సీఎం వెల్లడించారు. ఈ మేరకు అధికార యంత్రంగాన్ని ఆయన అప్రమత్తం చేశారు. ఇప్పటికే నష్టపోయిన బాధితులకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం సేకరించింది అందుకు అనుగుణంగా వారికి నష్టపరిహారాన్ని అందజేయనున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్