నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. నెలకు రూ.50 వేల వేతనం, ఈ అర్హతలు తప్పనిసరి

నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను ఐఐటి మద్రాస్ కల్పిస్తోంది. వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఖాళీలను భర్తీ చేస్తోంది. ఆయా ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అభ్యర్థులకు నెలకు రూ.50000 రూపాయల వేతనాన్ని అందించనుంది ఐఐటి మద్రాస్. దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థగా పేరు ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) మద్రాస్ లో ఈ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.

 IIT Madras Campus

ఐఐటి మద్రాస్ క్యాంపస్

నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను ఐఐటి మద్రాస్ కల్పిస్తోంది. వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఖాళీలను భర్తీ చేస్తోంది. ఆయా ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అభ్యర్థులకు నెలకు రూ.50000 రూపాయల వేతనాన్ని అందించనుంది ఐఐటి మద్రాస్. దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థగా పేరు ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) మద్రాస్ లో ఈ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులుగా పేర్కొన్నారు. ఈ సంస్థ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను కాంట్రాక్టు బేస్ విధానంలో భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.50 వేలు చొప్పున వేతనంతోపాటు ఇతర అలవెన్సులు లభిస్తాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా ఒకే ఒక కాలనీ భర్తీ చేయనుంది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఐఐటి మద్రాస్ అధికారిక వెబ్సైట్ www.iitm.ac.in ద్వారా అక్టోబర్ 14లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థి కాంట్రాక్టు వ్యవధి ప్రాథమికంగా ఏడాదిపాటు ఉండనుంది. అభ్యర్థి పనితీరు ఆధారంగా సర్వీస్ పీరియడ్ ను పొడిగించే అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా మెకానికల్ ఇంజనీరింగ్ లో ఎంఈ/ఎంటెక్ పూర్తి చేసి ఉండాలి. మెకానికల్ డిజైన్ ఇంజినీర్ గా ఏదైనా ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలో నాలుగేళ్లపాటు పనిచేసిన అనుభవం ఉండాలి. ఇతర టెక్నికల్ నాలెడ్జ్ కూడా అభ్యర్థి కలిగా ఉండాలి. మెకానికల్ టెస్టింగ్ నిర్వహించి కాన్స్టిట్యూటివ్ మెటీరియల్ మోడల్స్ డెవలపింగ్ లో అనుభవం కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల అర్హతలు అనుభవం ఆధారంగా రాత పరీక్షకు షార్ట్ లిస్టు రెడీ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు రాత పరీక్ష లేదా స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు రాతి పరీక్షలో మంచి స్కోరు వచ్చిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తరువాత ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు రాత్రి పరీక్ష ఇంటర్వ్యూ తేదీలను త్వరలోనే వెల్లడించనున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్