నిరుద్యోగులకు శుభవార్త.. ఇంటి దగ్గర నుంచి పనిచేస్తూనే ఏడు లక్షలు జీతం

నిరుద్యోగులకు శుభవార్తను అందించింది ప్రముఖ ఐటీ సంస్థ. ఇంటిదగ్గర పనిచేస్తూనే ఏడు లక్షల వరకు వేతనం పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇప్పటికే అనేక ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోం అవకాశాన్ని ఉద్యోగులకు కల్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఐటీ సాఫ్ట్వేర్ సర్వీసెస్ కంపెనీ హెక్సీ సాఫ్ట్ సొల్యూషన్స్ తాజాగా రిక్రూట్ డ్రైవ్ ప్రారంభించింది. ఈ కంపెనీ డేటా ఎంట్రీ ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఉద్యోగులు వారానికి ఐదు రోజులు మాత్రమే పని చేస్తే సరిపోతుంది. మొత్తం 10 కాలేలను ఈ నియామక ప్రక్రియ ద్వారా భర్తీ చేసేందుకు ఆ సంస్థ సిద్ధమైంది. టెక్ ఇండస్ట్రీలో కెరీర్ స్టార్ట్ చేయాలని అనుకునే ఫ్రెషర్లకు వార్డు టైం ఫ్లెక్స్బిలిటీ తో కూడిన చక్కటి రిమోట్ వర్క్ అవకాశం ఇది.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

నిరుద్యోగులకు శుభవార్తను అందించింది ప్రముఖ ఐటీ సంస్థ. ఇంటిదగ్గర పనిచేస్తూనే ఏడు లక్షల వరకు వేతనం పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇప్పటికే అనేక ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోం అవకాశాన్ని ఉద్యోగులకు కల్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఐటీ సాఫ్ట్వేర్ సర్వీసెస్ కంపెనీ హెక్సీ సాఫ్ట్ సొల్యూషన్స్ తాజాగా రిక్రూట్ డ్రైవ్ ప్రారంభించింది. ఈ కంపెనీ డేటా ఎంట్రీ ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఉద్యోగులు వారానికి ఐదు రోజులు మాత్రమే పని చేస్తే సరిపోతుంది. మొత్తం 10 కాలేలను ఈ నియామక ప్రక్రియ ద్వారా భర్తీ చేసేందుకు ఆ సంస్థ సిద్ధమైంది. టెక్ ఇండస్ట్రీలో కెరీర్ స్టార్ట్ చేయాలని అనుకునే ఫ్రెషర్లకు వార్డు టైం ఫ్లెక్స్బిలిటీ తో కూడిన చక్కటి రిమోట్ వర్క్ అవకాశం ఇది. హెక్సీ సాఫ్ట్ సొల్యూషన్స్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా డేటా మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేటివ్ పనులు చేయాల్సి ఉంటుంది. డేటా సంబంధిత బాధ్యతలను ఖచ్చితత్వం, ప్రైవసీతోపాటు పూర్తి ఎఫెక్టివ్ గా నిర్వహించేవారు ఈ పోస్టుకు అర్హులుగా ఆ సంస్థ పేర్కొంది. ఐటీ లేదా డేటా సంబంధిత కోర్సుల్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. విద్యార్థులు, చదువు పూర్తి చేసిన వాళ్లు కంపెనీలో జాయిన్ అవ్వచ్చు. కంప్యూటర్ తో పాటు స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉండాలి. అనుభవంతో పనిలేదు. ఎంపికైన వారికి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగంలో చేర్చుకుంటారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ కు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లో ప్రొఫిషియన్సీ ఉండాలి. బేసిక్ ఫార్ములాలు, డేటా ఫార్మేటింగ్, ఫిల్టర్, చార్టింగ్ వంటి ఫంక్షన్లతోపాటు స్ప్రైడ్ షీట్స్ లో వర్క్ చేయగలగాలి.

కచ్చితత్వంతో కూడిన మంచి టైపింగ్ స్పీడ్, మల్టిపుల్ టాస్కులను ప్రయారటైజ్ చేసుకునే డెడ్ లైన్ లోగా పూర్తి చేయగల టైం మేనేజ్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరిగా ఉండాలి. అడ్వాన్సుడ్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, SQL, డేటా సైన్స్ అండ్ స్టాటస్టిక్స్, బిజినెస్ అనలిటిక్స్, SAS ప్రోగ్రామింగ్, Tableau, క్లినికల్ డేటా మేనేజ్మెంట్, బిజినెస్ కమ్యూనికేషన్, నేచర్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, డీప్ లెర్నింగ్, డేటా స్ట్రక్చర్ అండ్ ఆల్గానిజమ్స్ లో నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన జీతం, ఇతర బెనిఫిట్స్ విషయానికి వస్తే వారంలో ఐదు రోజులపాటు పని ఉంటుంది. దేశంలో ఎక్కడి నుంచి అయినా పని చేసుకునే సదుపాయం ఉంది. ఏడాదికి నాలుగు లక్షల నుంచి ఏడు లక్షల వరకు ఆదాయం ఉంటుంది. వీటితోపాటు స్కిల్ డెవలప్మెంట్ చేసుకునేందుకు కంపెనీ తగిన ట్రైనింగ్ సెషన్స్ కూడా ప్రత్యేకంగా వీరి కోసం నిర్వహిస్తుంది. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మే 29వ తేదీ వరకు సమయం ఉంది. ఉద్యోగానికి ఎంపికైన వారు వెంటనే విధుల్లో చేరాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు కంపెనీ అధికారిక వెబ్సైట్ http://internshala.com/job/detail/fresher-remote-part-time-data-entry-operator-job-at-hexisoft-solutions ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్