తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశం

తెలంగాణలోని నిరుద్యోగ యువతకు శుభవార్త. ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇవ్వడంతోపాటు ఉద్యోగాన్ని కల్పించేందుకు ఒక సంస్థ ముందుకు వచ్చింది. శిక్షణ కాలంలో భోజనం, వసతి కూడా కల్పించనున్నారు. ఇప్పటికే ఎంతో మందికి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలను కల్పించారు. ఈ క్రమంలోనే రామనంద తీర్థ రూరల్‌ ఇనిస్టిట్యూట్‌ నిరుద్యోగులకు వివిధ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. భూదాన్‌ పోచంపల్లిలోని రామనంద తీర్థ రూరల్‌ ఇనిస్టిట్యూట్‌లో దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన(డీడీయూజీకేవై), తెలంగాణ పంచాయతీరాజ్‌, భారత ప్రభుత్వంలోని గ్రామీణ అభివృద్ధిశాఖ, తెలంగాణ ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలోని నిరుద్యోగ యువతకు శుభవార్త. ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇవ్వడంతోపాటు ఉద్యోగాన్ని కల్పించేందుకు ఒక సంస్థ ముందుకు వచ్చింది. శిక్షణ కాలంలో భోజనం, వసతి కూడా కల్పించనున్నారు. ఇప్పటికే ఎంతో మందికి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలను కల్పించారు. ఈ క్రమంలోనే రామనంద తీర్థ రూరల్‌ ఇనిస్టిట్యూట్‌ నిరుద్యోగులకు వివిధ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. భూదాన్‌ పోచంపల్లిలోని రామనంద తీర్థ రూరల్‌ ఇనిస్టిట్యూట్‌లో దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన(డీడీయూజీకేవై), తెలంగాణ పంచాయతీరాజ్‌, భారత ప్రభుత్వంలోని గ్రామీణ అభివృద్ధిశాఖ, తెలంగాణ ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణలో భాగంగా తెలంగాణకు చెందిన నిరుద్యోగ యువతీ, యువకులకు ఉచితంగా శిక్షణ, భోజనంతో కూడిన వసతి సదుపాయాన్ని కల్పిస్తున్నారు. అనంతరం ఉద్యోగాన్ని అందించనున్నారు. ఈ శిక్షణ కేంద్రంలో మూడున్నర నెలలపాటు వివిధ కోర్సుల్లో శిక్షణ అందించనున్నారు.

అకౌంట్‌ అసిస్టెంట్‌ టాలీ కోర్సులో శిక్షణకు బీకామ్‌ పూర్తి చేసి ఉండాలి. అలాగే, కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ కోర్సులో శిక్షణకు ఇంటర్మీడియట్‌ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు. అలాగే, ఆటో మొబైల్‌ టూ వీలర్‌ సరీసింగ్‌ శిక్షనకు పదో తరగతి పూర్తి చేసివాళ్లు అర్హుల. ఈ శిక్షణకు తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు నుంచి దరఖాస్తులను కోరుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని అధికారులు వెల్లడించారు. కోర్సుల శిక్షణకార్యక్రమానికి సంబంధించి యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం, జల్పూర్‌ గ్రామంలోని రామనంద తీర్థ రూరల్‌ ఇనిస్టిట్యూట్‌లో మే ఐదో తేదీలోపు అర్హతకలిగిన వాళ్లు ఒరిజినల్‌ సర్టిఫికెట్స్‌, జెరాక్స్‌ సెట్‌, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటో, ఆధార్‌ కార్డు, రేషన్‌కార్డుతోపాటు హాజరుకావాలి. అభ్యర్థులు వయసు 18 నుంచి 30 ఏళ్లలోపాటు మధ్య ఉండాలి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్