తెలంగాణ నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కారు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు మేలు చేకూర్చే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. తెలంగాణ బ్యాక్ వర్డ్ క్లాసెస్ స్టడీ బోర్డ్ (టీజీబీసీ) విడుదల చేసిన ప్రకటన ప్రకారం నిరుద్యోగులకు ఇకపై ప్రతినెల రూ.1500 చొప్పున బ్యాంకు ఖాతాలో జమ చేయమన్నారు. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం గడువుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో దరఖాస్తు చేసుకున్న వారికి అర్హతలను బట్టి సివిల్స్ సహా బ్యాంకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రభుత్వమే ఉచిత శిక్షణ అందించనుంది.
ప్రతీకాత్మక చిత్రం
తెలంగాణ నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కారు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు మేలు చేకూర్చే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. తెలంగాణ బ్యాక్ వర్డ్ క్లాసెస్ స్టడీ బోర్డ్ (టీజీబీసీ) విడుదల చేసిన ప్రకటన ప్రకారం నిరుద్యోగులకు ఇకపై ప్రతినెల రూ.1500 చొప్పున బ్యాంకు ఖాతాలో జమ చేయమన్నారు. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం గడువుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో దరఖాస్తు చేసుకున్న వారికి అర్హతలను బట్టి సివిల్స్ సహా బ్యాంకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రభుత్వమే ఉచిత శిక్షణ అందించనుంది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారము గడువు లాగా దరఖాస్తు చేసుకున్న వారికి పీజీబీసీ ఎంప్లాయిమెంట్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ఉచిత కోచింగ్ అందిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని టీజీబీసీ స్టడీ సర్కిల్స్ లో ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, వివిధ బ్యాంకింగ్ పరీక్షల కోసం సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఫౌండేషన్ కోర్స్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఈ ఉచిత కోచింగ్ ప్రోగ్రాం ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కాబోతోంది. ఇందుకోసం టిజిబిసి అధికారులు కూడా ఏర్పాట్లను పూర్తి చేశారు. సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు కూడా ఉచిత కోచింగ్ సేవలను ప్రారంభిస్తున్నట్లు టీజీబీసీ పేర్కొంది. మరోవైపు అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి తొమ్మిదో తేదీలోగా ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, వివిధ బ్యాంకింగ్ పరిక్షల ఉచిత కోచింగ్ కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
అధికారిక నోటిఫికేషన్ ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని అభ్యర్థుల తల్లిదండ్రుల ఆదాయం ఏడాదికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో అభ్యర్థుల కుటుంబ ఆదాయం రెండు లక్షలకు మించకూడదు. అభ్యర్థుల ఎంపిక విధానం ఇంటర్మీడియట్, డిగ్రీ పరీక్షల్లో పొందిన మార్కులు ఆధారంగా ఉంటుంది. రిజర్వేషన్ నిబంధన ప్రకారం బీసీ-ఏ 18 శాతం, బిసి-బి 26 శాతం, బీసీ- సీ మూడు శాతం, బిసి-డి 18 శాతం, ఎస్సీ 15 శాతం, ఎస్టి ఐదు శాతం, ఇతరులకు ఐదు శాతం చొప్పున కేటాయించనున్నారు. అర్హత సాధించిన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫిబ్రవరి 12 నుంచి 14 వరకు ఉంటుంది. మరిన్ని వివరాల కోసం ఆసక్తి కలిగిన అభ్యర్థులు టీజీబీసీ జారీ చేసిన హెల్ప్ లైన్ నెంబర్ 040-24071178 నెంబర్కు సంప్రదించాలి. కోర్సుకు ఎంపికైన వారికి వంద రోజులపాటు శిక్షణ ఉంటుంది. నిపుణులైన అధ్యాపక బృందం ప్రతిరోజు నాలుగు క్లాసులు బోధించనున్నారు.