ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు చేయాలనుకునే నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటైన ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు ఆ సంస్థ సిద్ధమవుతోంది. ఇప్పటికే వివిధ ఖాళీల భర్తీ చేసేందుకు అనుగుణంగా నోటిఫికేషన్ ఆ సంస్థ విడుదల చేసింది. FSAAI లో గ్రూప్ A, B పోస్టులకు ఉద్యోగ ప్రకటనను ఈ సంస్థ ఇచ్చింది. భారీ వేతనాలతో ఉద్యోగాలను అందించేందుకు నోటిఫికేషన్ వెలువడడంతో నిరుద్యోగులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు చేయాలనుకునే నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటైన ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు ఆ సంస్థ సిద్ధమవుతోంది. ఇప్పటికే వివిధ ఖాళీల భర్తీ చేసేందుకు అనుగుణంగా నోటిఫికేషన్ ఆ సంస్థ విడుదల చేసింది. FSAAI లో గ్రూప్ A, B పోస్టులకు ఉద్యోగ ప్రకటనను ఈ సంస్థ ఇచ్చింది. భారీ వేతనాలతో ఉద్యోగాలను అందించేందుకు నోటిఫికేషన్ వెలువడడంతో నిరుద్యోగులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తాతగా ఇచ్చిన గ్రూప్ ఏ, గ్రూప్ బి కేటగిరీలకు సంబంధించిన ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అభ్యర్థులకు వేతనం నెలకు రూ.1,23,100 నుంచి రూ.2,15,900 వరకు ఇవ్వనున్నారు.
ఆశావాహ అభ్యర్థులు అర్హత కలిగిన వాళ్లు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుకు సంబంధించిన వివరాలు, ఖాళీలకు సంబంధించిన అంశాలను fssai.gov.in వెబ్సైట్లో చూడవచ్చని ఆ సంస్థ ప్రకటించింది. ఈ పోస్టులకు గ్రాడ్యుయేట్లు, ఇంజనీర్లు, అనుభవం ఉన్న ప్రొఫెసర్ మాత్రమే కాకుండా ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కాలేలకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే రెండు డైరెక్టర్ పోస్టులు, మూడు జాయింట్ డైరెక్టర్ పోస్టులు, రెండు సీనియర్ మేనేజర్ పోస్టులు, నాలుగు మేనేజర్ పోస్టులు, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టు, పది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు, 4 సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. వీటితోపాటు అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ఒకటి, ఆరు అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హతలకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తే డైరెక్టర్ పోస్ట్ కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాఖలో సమాన స్థాయిలో పనిచేస్తున్న వారు మాత్రమే దరఖాస్తు చేయాలి. అభ్యర్థుల వయసు 56 ఏళ్లకు మించరాదు.