తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిరుపేదలకు మేలు చేకూర్చేలా తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయానికి సంబంధించి వివరాలు ఎలా ఉన్నాయి. తెలంగాణలో ప్రస్తుతం నిరుపేదలకు ఉచితంగా రేషన్ బియ్యం అందిస్తున్నారు. నెలపు ఒక్కో వ్యక్తికి 6 కేజీలు చొప్పున రేషన్ బియ్యాన్ని ఇస్తున్నారు. అయితే ఈ బియ్యం నాణ్యం లేకపోవడం వల్ల చాలామంది తినడం లేదు. కొన్ని సందర్భాల్లో వాసన కూడా వస్తుండడం దీనికి కారణంగా చెబుతున్నారు. ఈ బియ్యం ఇచ్చిన ఒకటే ఇవ్వకపోయినా ఒకటే అన్న భావన చాలామందిలో ఉంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే లబ్ధిదారులకు సన్న బియ్యం ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ప్రతీకాత్మక చిత్రం
తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిరుపేదలకు మేలు చేకూర్చేలా తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయానికి సంబంధించి వివరాలు ఎలా ఉన్నాయి. తెలంగాణలో ప్రస్తుతం నిరుపేదలకు ఉచితంగా రేషన్ బియ్యం అందిస్తున్నారు. నెలపు ఒక్కో వ్యక్తికి 6 కేజీలు చొప్పున రేషన్ బియ్యాన్ని ఇస్తున్నారు. అయితే ఈ బియ్యం నాణ్యం లేకపోవడం వల్ల చాలామంది తినడం లేదు. కొన్ని సందర్భాల్లో వాసన కూడా వస్తుండడం దీనికి కారణంగా చెబుతున్నారు. ఈ బియ్యం ఇచ్చిన ఒకటే ఇవ్వకపోయినా ఒకటే అన్న భావన చాలామందిలో ఉంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే లబ్ధిదారులకు సన్న బియ్యం ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ సన్న బియ్యం ఒక్కో లబ్ధిదారుడుకు ఎన్ని కిలోలు ఇవ్వాలి అన్నదానిపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఒక్కో వ్యక్తికి 6 కేజీలు చొప్పున సన్న బియ్యం ఇవ్వనున్నారు. ఒక ఇంట్లో ఐదుగురు కుటుంబ సభ్యులకు ఉంటే ఆ కుటుంబానికి మొత్తంగా 30 కేజీలు సన్న బియ్యం ఇవ్వనున్నారు. అందుకు అనుగుణంగా సన్న బియ్యం శబ్దం చేసే పనిలో ప్రభుత్వం ఉంది. ఖరీఫ్ వానాకాలం సీజన్లో ప్రభుత్వం.. రైతులు వడ్లు వేసేలా ప్రోత్సహించింది. నవంబర్లో సన్న వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇప్పుడు ఆ ధాన్యాన్ని బియంగా మార్చుతోంది. వీటినే ఇప్పుడు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర 16 లక్షల టన్నుల బియ్యం సిద్ధంగా ఉన్నాయి. అందులో భాగంగా ఈ పథకాన్ని అమలు చేసేందుకు ఈ బియ్యం సరిపోతాయి అని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకే ఈ పథకాన్ని మార్చి 30 నుంచి అంటే ఉగాది రోజున ప్రారంభించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఉగాది నెలాఖరులో వచ్చింది కాబట్టి మార్చి నెలలో సన్నబియ్యం ఇవ్వరు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. ఇలా చేయడం వల్ల 8 నెలల పాటు ప్రస్తుతం నిల్వ ఉన్న బియ్యం పంపిణీ చేసేందుకు అవకాశం ఉంటుంది. అంటే నవంబర్ నెల వరకు 16 లక్షల అటువంటి బియ్యం లబ్ధిదారులకు అందించేందుకు సరిపోతాయని ప్రభుత్వం లెక్కలు వేసుకుంటుంది. ఆ తర్వాత మళ్లీ కొనుగోలు చేసి వాటిని పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఏది ఏమైనా ప్రభుత్వం నాణ్యమైన సన్న బియ్యం లబ్ధిదారులకు అందించేందుకు ఏర్పాటు చేస్తుండడం పట్ల లబ్ధిదారులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. రవి సీజన్లో కొనుగోలు చేసే సన్న బియ్యాన్ని ఈ ఏడాది డిసెంబర్ నుంచి ఇవ్వడానికి వీలవుతుంది. అందువల్ల ఈ పథకం అమలులో ఎటువంటి ఇబ్బంది ఉండదు అని ప్రభుత్వం భావిస్తోంది.
ఇప్పటికే ఇస్తున్న దొడ్డ బియ్యం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇచ్చే సన్న బియ్యంలో పోషకాలు పరంగా పెద్దగా తేడా ఏమీ ఉండదు. బియ్యంలో పోషకాలు అవే ఉంటాయి. కాకపోతే సన్న బియ్యం తినేందుకు కాస్త ఒక యుక్తంగా ఉంటుంది. అన్నం తినబుద్ధి అవుతుంది. తద్వారా శరీరానికి పోషకాలు సరిపడే విధంగా దక్కుతాయి. ఈ పథకం అమలులోకి వస్తే ప్రభుత్వం ఇచ్చిన మరో హామీ నిలబెట్టుకున్నట్టు అవుతుంది. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న బియ్యం చాలామంది తినడం లేదు. రేషన్ దుకాణాల నుంచి నేరుగా వ్యాపారుల వద్దకు చేరుతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ఈ పథకంలో మార్పులు చేసే నాణ్యమైన బియ్యం అందించేందుకు ఏర్పాటు చేస్తుంది. దీనివల్ల అమ్మకాలు తగ్గడంతోపాటు పోషకాలతో కూడిన అన్నం లబ్ధిదారులు తినేలా చేయవచ్చని ప్రభుత్వం భావించి ఈ నిర్ణయం తీసుకుంది.