తెలంగాణలోని ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా లబ్ధిదారుల కోసం ఇళ్లను మంజూరు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈనెల తెలుగు వారంలోనే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్నాహాల్ చేస్తుంది. అనివార్య కారణాల వల్ల ఈ వారంలో ప్రారంభం చేసేందుకు అవకాశం లేకపోతే వచ్చే వారంలో ప్రారంభించనుంది.
ఇందిరమ్మ ఇళ్ల, రేవంత్ రెడ్డి
తెలంగాణలోని ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా లబ్ధిదారుల కోసం ఇళ్లను మంజూరు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈనెల తెలుగు వారంలోనే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్నాహాల్ చేస్తుంది. అనివార్య కారణాల వల్ల ఈ వారంలో ప్రారంభం చేసేందుకు అవకాశం లేకపోతే వచ్చే వారంలో ప్రారంభించనుంది. ఇప్పటికే వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మరో రెండు మూడు రోజుల్లోనే ఈ పథకాన్ని ప్రారంభించి రెండు నుంచి మూడో వారంలోగా లబ్ధిదారులకు ఉత్తర్వులను విడుదల చేసేలా ప్రభుత్వం అసరాదు చేస్తోంది. మొదట విడతగా నిరుపేదలకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. ఈనెల 5వ తేదీ నుంచి ఇందిరమ్మ ఇళ్ల కు సంబంధించి యాప్ ను అందుబాటులోకి తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభిస్తామనించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 4.5 లక్షల ఇల్లు మంజూరు చేయనున్నారు. రాబోయే నాలుగేళ్లపాటు ఇందిరమ్మ ఇల్లు పంపిణీ కొనసాగనుంది. త్వరలోనే ప్రతి నియోజకవర్గంలో 3,500 చొప్పున ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని మంత్రి ప్రకటించారు. వీటికోసం ఇప్పటికే మూడు వేల కోట్లను కేటాయించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామస్థాయిలో ఇందిరమ్మ కమిటీలను నియమించింది.
తాజా నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం ఎదురుచూస్తున్నారు వేలాదిమందికి మేలు చేకూరనుంది. నియోజకవర్గ స్థాయిలో తొలి విడతలో నిరుపేదలైన వారికి ఈ ఇళ్లను కేటాయించనున్నారు. ఇప్పటికే వివిధ పథకాల రూపంలో ఇల్లు పొందిన వారికి అవకాశం కల్పించరు. ఇప్పటివరకు ప్రభుత్వం ద్వారా రూపాయి కూడా లబ్ది పొందని వారికి మాత్రమే ఇల్లు కట్టుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు గ్రామస్థాయిలో కమిటీలను ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఒకవేళ కమిటీలు ఇప్పటికే ఏర్పాటు కాకపోతే ఈ ప్రక్రియను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని ఆయా నియోజకవర్గాల ఇన్చార్జిలకు, స్థానిక ఎమ్మెల్యేలకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. రానున్న ఏడాది కాలంలో కనీసం 50 వేల మందికి ఇళ్లను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.