తెలంగాణలోని నిరుపేదలకు రేవంత్ రెడ్డి సర్కారు శుభవార్త చెప్పింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో శనివారం సాయంత్రం జరిగిన క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం.. రాష్ట్రంలోని నిరుపేదలకు సొంత గూడు కల్పించాలని నిర్ణయించింది. అర్హులైన లబ్ధిదారులకు దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇళ్ళను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో సిద్ధంగా ఉన్న ఈ ఇళ్లను లబ్ధిదారులకు అందించనున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలోని నిరుపేదలకు రేవంత్ రెడ్డి సర్కారు శుభవార్త చెప్పింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో శనివారం సాయంత్రం జరిగిన క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం.. రాష్ట్రంలోని నిరుపేదలకు సొంత గూడు కల్పించాలని నిర్ణయించింది. అర్హులైన లబ్ధిదారులకు దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇళ్ళను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో సిద్ధంగా ఉన్న ఈ ఇళ్లను లబ్ధిదారులకు అందించనున్నారు. అలాగే కొత్త ఇళ్ల నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన కూడా అదే రోజు చేయనున్నారు. ఇదే విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. దీపావళి పండుగ అమావాస్య రోజు వస్తుంది. కనుక మరుసటి రోజు చూసుకొని తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్ళను నిర్మించనున్నారు. వీటిని అర్హులైన నిరుపేద లబ్ధిదారులకు అందించనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు ఏర్పాటు చేసే కమిటీలు అర్హులైన లబ్ధిదారులు జాబితా రూపొందించి, ప్రత్యేక యాప్ లో వివరాలు నమోదు చేస్తారు. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా పారదర్శకంగా ఇందిరమ్మ ఇల్లా లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని మంత్రులు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తుంది. లబ్ధిదారులకు అందించే ఇల్లు విశాలంగా ఉండడంతో పాటు ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పనకు పెద్దపీట వేయనుంది.
అలాగే రాష్ట్రంలో కులగణన ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. స్థానికత విషయంలో 317 జీవో, కొత్త ఉద్యోగాలు పత్తిపై 46 జీవో పై తెలంగాణ అసెంబ్లీలో చర్చించిన తర్వాత తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నారు. స్థానికత అంశం రాష్ట్రపతి పరిధిలో ఉంటుంది. కాబట్టి న్యాయ సలహా ముందుగా తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. అనంతరం అసెంబ్లీలో చర్చించి కేంద్రానికి ప్రతిపాదన చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. కులగలను సంబంధించి అడిగేందుకు రూపొందించిన ప్రశ్నలకు తెలంగాణ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. నవంబర్ 4, 5 తేదీల్లో ప్రారంభించి నవంబర్ 30లోగా కుల గణను పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా మెట్రో రైల్ రెండో దశ డిపిఆర్ కు, కొత్త రోడ్ల నిర్మాణానికి, రిజర్వాయర్లలో పేరుకుపోయిన పూడికను తొలగించేందుకు కూడా నిర్ణయించింది.