ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులు మంజూరు షురూ.!

కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. డిసెంబర్ రెండో తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించనుంది. ఈ ప్రక్రియ డిసెంబర్ రెండో తేదీన ప్రారంభించి అదే నెల 28 వరకు కొనసాగించనుంది.

new ration cards

 రేషన్ కార్డులు

ఏపీ ప్రజలకు ఓటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నాళ్ళ నుంచి ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. డిసెంబర్ రెండో తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించనుంది. ఈ ప్రక్రియ డిసెంబర్ రెండో తేదీన ప్రారంభించి అదే నెల 28 వరకు కొనసాగించనుంది. సుమారు 26 రోజులు పాటు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే సంక్రాంతి నాటికి ప్రక్రియ పూర్తి చేసి సంక్రాంతి కానుకగా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయాలు ద్వారా రేషన్ కార్డులు మంజూరు చేశారు. కొన్ని నెలల నుంచి రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ నిలిచిపోయింది.

ఈ నేపథ్యంలోనే ఏపీలో నూతనంగా ఏర్పాటు అయిన కోటను ప్రభుత్వం కొత్త ఏడాదిలో రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు ఏర్పాటు చేస్తోంది. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అర్హులైన చాలామంది అనేక సంక్షేమ పథకాలను పొందేందుకు కొత్త రేషన్ కార్డులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటువంటి ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించి ఈ మేరకు చర్యలు చేపడుతుంది. డిసెంబర్ నెలకి దరఖాస్తులు స్వీకరణ పూర్తి చేయడంతోపాటు వాటిని స్క్రూట్ని చేయనుంది. ఆయా దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అర్హులైన వారిని ఎంపిక చేసి కొత్త డిజైన్లతో రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. కొత్తగా అందించే రేషన్ కార్డు మీద కుటుంబ సభ్యుల ఫోటోలతోపాటు క్యూఆర్ కోడ్ ఉండేలా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ఆ కుటుంబ సభ్యుల సమాచారం మొత్తం వచ్చేలా ఈ నూతన రేషన్ కార్డులను డిజైన్ చేసుకున్నారు. ఏది ఏమైనా తాజాగా ప్రభుత్వం నూతన రేషన్ కార్డులు అందించాలని తీసుకున్న నిర్ణయం పట్ల అర్హులైన లబ్ధిదారులు ఆనందం వ్యక్తం అవుతుంది. గడిచిన కొన్ని నెలల నుంచి రేషన్ కార్డులు కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో ఆశగా ఎదురు చూస్తున్న వేలాదిమందికి ఈ నిర్ణయం వల్ల మేలు చేకూరనుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్