ఏపీలో దివ్యాంగులకు గుడ్‌ న్యూస్‌.. సదరం స్లాట్స్‌ బుకింగ్‌ అప్పటి నుంచే

ఏపీలో గడిచిన కొన్ని నెలలు నుంచి నిలిచిపోయిన సదరం స్లాట్‌ బుకింగ్స్‌కు ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు పది నెలలు కావస్తోంది. ఇప్పటి వరకు సదరం స్లాట్స్‌ బుకింగ్స్‌కు ప్రభుత్వం అవకాశం కల్పించలేదు. దీంతో రాష్ట్రంలోని వేలాది మంది అర్హులైన దివ్యాంగులు పెన్సన్‌ పొందలేకపోయిన పరిస్థితి. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఒక కారణం చెబుతూ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులైన పెన్సనర్లును ఏరివేత ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా పెన్సన్లు రీ వెరిఫికేషన్‌ చేస్తోంది. ఈ ప్రక్రియ ముగిసిన తరువాత కొత్త పెన్సన్లు మంజూరు ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

ఏపీలో గడిచిన కొన్ని నెలలు నుంచి నిలిచిపోయిన సదరం స్లాట్‌ బుకింగ్స్‌కు ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు పది నెలలు కావస్తోంది. ఇప్పటి వరకు సదరం స్లాట్స్‌ బుకింగ్స్‌కు ప్రభుత్వం అవకాశం కల్పించలేదు. దీంతో రాష్ట్రంలోని వేలాది మంది అర్హులైన దివ్యాంగులు పెన్సన్‌ పొందలేకపోయిన పరిస్థితి. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఒక కారణం చెబుతూ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులైన పెన్సనర్లును ఏరివేత ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా పెన్సన్లు రీ వెరిఫికేషన్‌ చేస్తోంది. ఈ ప్రక్రియ ముగిసిన తరువాత కొత్త పెన్సన్లు మంజూరు ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది. దీంతో సదరం స్లాట్లమంజూరు ప్రక్రియను ఆలస్యం చేస్తూ వచ్చింది. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వందలాది మంది దివ్యాంగులు ప్రభుత్వ పెద్దలను కలిసి వినతులు సమర్పిస్తుండడంతో ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి సదరం స్లాట్లనుజారీ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో సుమారు ఏడాది నుంచి ఎదురు చూస్తున్న దివ్యాంగులకు మేలు చేకూరనుంది. ఈ సదరం సర్టిఫికెట్లు ఉంటేనే ప్రభుత్వం అందించే రాయితీలు గానీ, పెన్సన్లుగానీ పొందేందుకు అవకాశం ఉంది. దీంతో వీటికి పెద్ద ఎత్తున డిమాండ్‌ ఉంది. 

సదరం స్లాట్లను గ్రామ/వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల్లో బుక్‌ చేసుకునేందుకు అవకాశం ఉంది. స్లాట్‌ బుక్‌ చేసుకున్న తరువాత సదరు వ్యక్తి ఫోన్‌ నెంబరుకు ఎస్‌ఎంఎస్‌ రూపంలో వివరాలు వస్తాయి. సదరు స్లాట్‌లో కేటాయించిన ఆస్పత్రికి అందులో పేర్కొన్న తేదీ, సమయానికి వెళ్లి వైద్యులకు చూపించుకోవాల్సి ఉంటుంది. సదరు వైద్యులు వైకల్యాన్ని నిర్ధారించి సర్టిఫికెట్లు జారీ చేస్తారు. సదరం సర్టిఫికెట్లను శారీరక, మానసిక వైకల్యం ఉన్న వారికి, కంటిచూపు లోపం ఉన్న వారికి కేటాయిస్తారు. స్లాట్‌ బుక్‌ చేసుకోవడానికి ఆధార్‌ కార్డు, పాస్‌పోర్టు సైజు ఫొటో ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పేరు, ఇంటిపేరు, పుట్టిన తేదీ, వయసు, లింగం, వైవాహిక స్థితి, కులం, మతం, విద్యార్హత, రేషన్‌ కార్డు నెంబరు వంటివి నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత ఏ ఆస్పత్రికి వెళ్లాలనుకుంటున్నారో ఆ ఆస్పత్రి, పేరు, సమయంతో కూడిన మెసేజ్‌ ఫోన్‌కు వస్తుంది. ఆయా తేదీల్లో ఆస్పత్రుల్లో నిర్వహించే సదరం శిబిరాల్లో వైద్యులు పరీక్షించి వైకల్యాన్ని నిర్ధారించి సర్టిఫికెట్లు అందిస్తారు. సర్టిఫికెట్‌ ఉన్న వాళ్లు పనరుద్దరణకు కూడా స్లాట్‌ బుక్‌ చేసుకోవాల్సిఉంటుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్