కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. ఆ నిర్ణయంతో భారీగా పెరగనున్న వేతనాలు.!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. కొద్దిరోజుల్లోనే ఎనిమిది వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. దీని సిఫార్సుల ఆధారంగా ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు చేస్తే.. ఈ సంఘం ఇచ్చే సిఫార్సులు కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. కొద్దిరోజుల్లోనే ఎనిమిది వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. దీని సిఫార్సుల ఆధారంగా ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు చేస్తే.. ఈ సంఘం ఇచ్చే సిఫార్సులు కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎనిమిదో వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రస్తుతం మినిమం బేసిక్ పే మొత్తాన్ని రూ.18,000 నుంచి రూ.34,500 కు పెంచే అవకాశం ఉంది. వేతన సంఘం ఏర్పాటు ప్రక్రియ వేగంగా జరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా వేతనాలు పెరగనున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న లక్షలాదిమంది ఉద్యోగులు ఈ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించి ఆశగా ఎదురుచూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పింఛన్ దారులకు ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా జీతాలు, అలవెన్సులు, పెన్షన్ ప్యాకేజీలను సవరించేందుకు ఏర్పాటు చేసేవే ఈ వేతన సంఘాలు. ప్రస్తుత కాలంలో మనిషి జీవనవేయాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.

ఉద్యోగుల అవసరాలు, ఖర్చులు కూడా ఆ స్థాయిలోనే పెరిగాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక అవసరాలకు తగ్గట్టుగా జీతాలను అలవెన్సులను నిర్ణయించే బాధ్యత ఈ వేతన సంఘాలకు ప్రభుత్వం అప్పగిస్తుంది. 10 ఏళ్లకు ఒకసారి వేతన సంఘాన్ని ఏర్పాటు చేసి ఉద్యోగుల జీతాలు అలవెన్సులను సవరిస్తారు. ప్రస్తుతం ఏడవ వేదన సంఘం సిఫార్సులు అమలులో ఉన్నాయి. 2014లో ఈ వేతన సంఘం ఏర్పాటు చేయగా, 2016 నుంచి సిఫార్సులు అమలులోకి వచ్చాయి. 202 తో పదేళ్ల కాలం పూర్తవుతుంది. కాబట్టి 8వ వేతన సంఘం ఏర్పాటు చేసి ఈ సంఘం ఇచ్చే సిఫార్సులను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందుకు అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు సిద్ధమైనట్లు చెబుతున్నారు ఈ పార్లమెంటు సమావేశాలు ముగిసిన వెంటనే వచ్చే ఏడాది ఆరంభంలో వేతన సంఘాన్ని ప్రకటించే అవకాశం ఉంది 2026 జనవరి నుంచి ఎనిమిదో వేతన సంఘం సిఫార్సులు అమలు చేయనున్నారు. ఎనిమిదో వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగానే భారీగా ఉద్యోగులకు వేతనాలు పెరిగే అవకాశం ఉంది. ఇది లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మేలు చేకూర్చే అంశంగా పలువురు చెబుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్