ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు శుభవార్త.. బీసీ స్టడీ సర్కిల్స్ లో ఇకపై ఉచిత శిక్షణ

ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమయ్యే నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను చెప్పింది. వివిధ శాఖల్లోని పోస్టుల కోసం సిద్ధమయ్య అభ్యర్థులు భారీగా ఖర్చుపెట్టి మరి శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్థికంగా అంతంతమాత్రంగానే స్తోమత ఉన్న ఎంతో మంది నిరుపేదలు శిక్షణ తీసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అటువంటి వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ స్టడీ సర్కిల్స్లో నిరుపేదలకు ఉచితంగా పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే ఏర్పాటు చేస్తోంది.

Candidates undergoing training

శిక్షణ పొందుతున్న అభ్యర్థులు

ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమయ్యే నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను చెప్పింది. వివిధ శాఖల్లోని పోస్టుల కోసం సిద్ధమయ్య అభ్యర్థులు భారీగా ఖర్చుపెట్టి మరి శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్థికంగా అంతంతమాత్రంగానే స్తోమత ఉన్న ఎంతో మంది నిరుపేదలు శిక్షణ తీసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అటువంటి వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ స్టడీ సర్కిల్స్లో నిరుపేదలకు ఉచితంగా పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్రంలోని బీసీ స్టడీ సర్కిల్స్ తో పాటు ఏపీ స్టడీ సర్కిల్లో ఉచితంగా ఉపాధ్యాయ పోస్టుల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేశారు. ఉచిత శిక్షణతో పాటు మూడు వేల రూపాయలు విలువచేసే మెటీరియల్, శిక్షణా కాలంలో కొంత భృతి చొప్పున అందించనుంది ప్రభుత్వం. అయితే ఒక్క ఉపాధ్యాయ అభ్యర్థులకు మాత్రమే కాకుండా మిగిలిన పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు కూడా ఈ తరహాలోనే ఉచిత శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఈ శుభవార్తను వెల్లడించారు. రాష్ట్రంలోని 26 జిల్లా కేంద్రాల్లో స్టడీ సర్కిల్స్ ద్వారా శిక్షణ అందించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వందలాదిమంది నిరుద్యోగులకు మేలు జరగనుంది. ప్రస్తుతం ఏ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన శిక్షణ తీసుకోవాలంటే కనీసం రూ.5000 నుంచి రూ.10000 వరకు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల నిరుపేదలైన ఎంతోమంది అభ్యర్థులకు మేలు చేకూరనుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ఈ శిక్షణ కేంద్రాలు అందుబాటులో ఉండడంతో అభ్యర్థులు సుదీర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. సొంత జిల్లాలోనే ఉంటూ శిక్షణ పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. శిక్షణ కాలంలో కొంత భృతి కూడా ఇచ్చే ఆలోచనలు ప్రభుత్వం ఉంది. ఇది మరింతగా సదరు అభ్యర్థులకు మేలు చేయనుంది. ఇప్పటికే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం మరికొద్ది రోజుల్లోనే పెండింగ్లో ఉన్న కానిస్టేబుల్ పోస్టులు భర్తీ ప్రక్రియను కూడా పూర్తి చేయనుంది. ఆ తర్వాత మిగిలిన శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. కొత్తగా నోటిఫికేషన్ విడుదల అయిన తరువాత బీసీ స్టడీ సర్కిల్స్ లో ఈ ఉచిత శిక్షణ కార్యక్రమం ప్రారంభం కానుంది. కనీసం మూడు నెలలపాటు అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించనుంది బీసీ స్టడీ సర్కిల్స్ ఆధ్వర్యంలో ప్రభుత్వం.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్