విద్యుత్ వాహనాల కొనుగోలుదారులకు శుభవార్త.. భారీ సబ్సిడీని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

దేశంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం వినియోగదారులకు శుభవార్తను చెప్పింది. విద్యుత్ వాహనాల కొనుగోలుదారులకు భారీ ఎత్తున సబ్సిడీ అందించేందుకు ముందుకు వచ్చింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.10,900 కోట్లతో పీఎం ఈ డ్రైవ్ పథకాన్ని ఆవిష్కరించింది. ఈ పథకంలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలుదారులకు సబ్సిడీని అందించనుంది కేంద్ర ప్రభుత్వం. 2024 అక్టోబర్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.

electric vehicles

విద్యుత్ వాహనాలు

దేశంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం వినియోగదారులకు శుభవార్తను చెప్పింది. విద్యుత్ వాహనాల కొనుగోడుదారులకు భారీ ఎత్తున సబ్సిడీ అందించేందుకు ముందుకు వచ్చింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.10,900 కోట్లతో పీఎం ఈ డ్రైవ్ పథకాన్ని ఆవిష్కరించింది. ఈ పథకంలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలుదారులకు సబ్సిడీని అందించనుంది కేంద్ర ప్రభుత్వం. 2024 అక్టోబర్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ పథకంలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు చేసే వినియోగదారులకు సబ్సిడీ అందించనున్నారు. విద్యుత్ ద్విచక్ర వాహనాలకు వాటి బ్యాటరీ సామర్థ్యం ఆధారంగా సబ్సిడీ ఉంటుంది. కిలో వాట్ అవర్ కు రూ.5 వేలు సబ్సిడీ అందించనున్నారు. సబ్సిడీ తొలి ఏడాదిలో పదివేలకు మించదు. రెండో ఏడాదిలో కిలోవాటుకు రూ.2,500 చొప్పున ఉంటుంది. మొత్తం ప్రయోజనం 5 వేలకు మించదు. ద్విచక్ర వాహనాలకు తొలి ఏడాది రూ.25,000, రెండో ఏడాది రూ.12,500 చొప్పున ప్రోత్సాహకాలను అందించనున్నారు. ఎల్ 5 విభాగం అంటే రవాణా చేసే త్రిచక్ర వాహనాలకు తొలి ఏడాదిలో రూ.50 వేలు, రెండో ఏడాదిలో రూ.25 వేలు చొప్పున సబ్సిడీ అందించనున్నారు.

మార్కెట్ లో ప్రస్తుతం లభిస్తున్న ఓలా, టీవీఎస్, ఏథర్, హీరో విడా, బజాజ్ చేతక్ ద్విచక్ర వాహనాల బ్యాటరీ సామర్థ్యాలు 2.88 - 4 కిలో వాట్ అవర్ శ్రేణిలో ఉన్నాయి. ఈ వాహన ధరలు రూ.90 వేలు నుంచి రూ.1.50 లక్షల మధ్య ఉన్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు సబ్సిడీ అందించేందుకు ప్రత్యేకంగా మొబైల్ యాప్ ను ఆవిష్కరించనున్నారు. దీని సహాయంతో ఈ పథకం కింద ఈ వాచర్లను అందించడం ద్వారా మొత్తం ప్రక్రియను సరళతరం చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఒక ఆధార్ నంబర్ పై వాహనాన్ని అనుమతించనున్నారు. కొనుగోలు చేసిన వెంటనే పోర్టల్ లో ఆధార్ ఆధారిత ఈ ఓచర్ జనరేట్ అవుతుంది. దానిపై సంతకం చేసి డీలర్కు అందిస్తే ప్రోత్సాహకాలు పొందవచ్చు. విద్యుత్ విభాగంలోని ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు, అంబులెన్సులు, ట్రక్కులు, ఇతరు వాహనాలకు రూ.3,679 కోట్ల మేర సబ్సిడీలను ఈ పథకం కింద అందించనుంది. కేంద్ర ప్రభుత్వం కార్లకు 22,100 చార్జర్ వసతులను, ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు రూ.48,400 చార్జర్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు  ఇందుకోసం రూ.2000 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. దీనివల్ల భవిష్యత్తులో విద్యుత్ వాహనాల వినియోగాన్ని మరింత పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యానికి అనుగుణంగా వినియోగదారుల సంఖ్యను పెంచాలంటే సబ్సిడీ అందించడంతోపాటు ఎలక్ట్రిక్ వాహనాలను చార్జింగ్ చేసేందుకు స్టేషన్లను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చర్యలను వేగవంతం చేయడం ద్వారా అనుకున్న లక్ష్యాలను సాధించాలని కార్యాచరణను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్