తెలుగు రాష్ట్రాలకు శుభవార్త.. కేంద్రీయ, నవోదయ విద్యాలయాల మంజూరు చేసిన కేంద్రం

రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే కేంద్రీయ, నవోదయ విద్యాలయాలను రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం కేటాయించింది. తెలంగాణకు ఏడు నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేసేందుకు అనుగుణంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. ఏపీలో ఎనిమిది కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చింది.

Kendriya and Navodaya Vidyalayas

కేంద్రీయ, నవోదయ విద్యాలయాలు

రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే కేంద్రీయ, నవోదయ విద్యాలయాలను రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం కేటాయించింది. తెలంగాణకు ఏడు నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేసేందుకు అనుగుణంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. ఏపీలో ఎనిమిది కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చింది. దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాలను మరిన్ని ఏర్పాటు చేయాలని భావించిన కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు అనుమతులను జారీ చేసింది. దేశవ్యాప్తంగా కొత్తగా 85 కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. అలాగే 28 నవోదయ విద్యాలయాలను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలను తీసుకుంది. ఈ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవి తాజాగా వెల్లడించారు. నూతన కేంద్రీయ విద్యాలయాల ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 82,000 మందికి పైగా విద్యార్థులకు ఉన్నత నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్య అందం ఉంది. దేశంలో కొత్త కేంద్రీయ విద్యాలయాల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.5,872 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. ఆయా కేవీలు అందుబాటులోకి వస్తే వందలాదిమంది విద్యార్థులు చదువుకునే అవకాశం కలుగుతుంది. ఒక్కో కేంద్రీయ విద్యాలయంలో 960 మంది విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం దక్కనుంది. ఏపీలో ఏర్పాటు చేయబోతున్న కేంద్రీయ విద్యాలయాలు విషయానికొస్తే.. అనకాపల్లి, చిత్తూరులోని వలస పల్లె, సత్యసాయి జిల్లాలోని పాలసముద్రం, ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తాళ్లపల్లె, రొంపిచర్ల, ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నందిగామ, నూజివీడు, నంద్యాల జిల్లాలోని డోన్ లో కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు సంబంధించి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

ఇక తెలంగాణలో ఏర్పాటు చేయాలని భావించిన నవోదయ విద్యాలయాలకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలో కొత్తగా ఏడు నవోదయ విద్యాలయాలు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీడు ద్వారా కొత్తగా వందలాదిమంది విద్యార్థులకు మేలు చేకూరనుంది. వీటిని జగిత్యాల, నిజామాబాద్, కొత్తగూడెం, మేడ్చల్, మహబూబ్నగర్, సంగారెడ్డి, సూర్యాపేటలో నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయనుంది. ఆయన నవోదయలు అందుబాటులోకి వస్తే సుమారు 5600 మంది విద్యార్థులకు అవకాశం దక్కనుంది. ఒక్కో నవోదయలో 560 మంది విద్యార్థులు చేరేందుకు అవకాశం కల్పించనున్నారు. తాజా నిర్ణయం పట్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులతోపాటు ఆయా ప్రభుత్వ ప్రతినిధులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. నవోదయ, కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించి ఎప్పటి నుంచో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరుతూ వస్తున్నాయి. గడిచిన కొన్నేళ్లుగా కొత్తవి మంజూరు చేయకపోవడంతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్త వాటిని మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిగ్నల్ ఇవ్వడంతో వేలాది మంది నిరుపేద విద్యార్థులకు మంచి అవకాశాలు దక్కనున్నాయి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్