తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్.. పది లక్షల రూపాయలు పొందే సువర్ణ అవకాశం

తెలంగాణలోని మహిళలకు సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు రూ.10 లక్షల వరకు చేయూత అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం సదరు మహిళలు తప్పనిసరిగా డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉండాల్సిన అవసరం ఉంది. మహిళలకు ఆర్థిక చేయూత అందించే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.

women

మహిళ

తెలంగాణలోని మహిళలకు సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు రూ.10 లక్షల వరకు చేయూత అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం సదరు మహిళలు తప్పనిసరిగా డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉండాల్సిన అవసరం ఉంది. మహిళలకు ఆర్థిక చేయూత అందించే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరి కోసం వినూత్నమైన ఆలోచనతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మహిళలతో మహిళా క్యాంటీన్లు ఏర్పాటు చేయించాలని రేవంత్ రెడ్డి సర్కార్ యోచిస్తోంది. జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఈ క్యాంటీన్లను మహిళలతో ఏర్పాటు చేయించనుంది. ఇందుకోసం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా డ్వాక్రా మహిళలకు రుణాలను అందించనున్నారు. ప్రధానంగా సంగారెడ్డి జిల్లాలో అమీర్పూర్, సదాశివపేట, జోగిపేట, ఆందోల్, నారాయణఖేడ్, ఐడిఏ బొల్లారం, జహీరాబాద్ తెల్లాపూర్ పురపాలక సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో 5,189 మహిళా సంఘాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ సంఘాల్లో 48,854 మంది మహిళా సభ్యులు ఉన్నారు.

ఈ మహిళా సంఘాల్లోని వారి ద్వారా ఈ ఏడాది ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వీటి నిర్వహణకు మహిళా సంఘాల సభ్యులకు ఐదు లక్షల నుంచి రూ.10 లక్షల వరకు మెప్మా నుంచి రుణాలను అందించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతోంది. గత నెలలో నారాయణఖేడ్ లో మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించారు. ఇప్పుడు ఇతర ప్రాంతాల్లో కూడా ఈ క్యాంటీన్లు ప్రారంభం కానున్నట్లు చెబుతున్నారు. మెప్మా సిబ్బంది క్షేత్రస్థాయిలో సర్వే చేసి ఆసక్తి ఉన్న వారిని గుర్తించి వారికి క్యాంటీన్లను మంజూరు చేయనున్నారు. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో ఈ ప్రోగ్రామ్  అమలు చేస్తుండగా, రానున్న రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆసక్తి కలిగిన మహిళల నుంచి మెప్మా సిబ్బంది వివరాలను సేకరిస్తున్నారు. దీనివల్ల మహిళలు ఆర్థికంగా వారు బలోపేతం కావడంతోపాటు మహిళా శక్తి క్యాంటీన్లలో మరో నలుగురుకు ఉపాధి అవకాశాలను కల్పించనున్నారు. భవిష్యత్తులో మరింత మందికి ఈ తరహా అవకాశాలను కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందుకు అనుగుణంగా రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాన్ని కూడా గతంలో నిర్వహించారు. రానున్న రోజుల్లో ఈ ప్రోగ్రామ్ ను రాష్ట్రంలోనే ఇతర జిల్లాల్లో కూడా అమలు చేయడం ద్వారా మరింత మంది మహిళలకు అవకాశాలు కల్పించే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. ఇది మహిళలకు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు గొప్ప అవకాశంగా భావించవచ్చని పలువురు పేర్కొంటున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్