తెలంగాణ నిరుపేదలకు శుభవార్త.. భూమిలేని నిరుపేద కూలీలకు ఆర్థిక సాయం

తెలంగాణలోని భూమిలేని నిరుపేదలకు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇందులో భాగంగా మరో కీలక పథకాన్ని అమలు చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. భూమి లేని నిరుపేద కూలీలకు ఏటా రూ.12 వేలు చొప్పున ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. గడిచిన ఎన్నికలకు ముందు నిరుపేద కూలీలకు రూ.12 వేలు చొప్పున ఇస్తామని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. వచ్చే నెల నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.

Landless laborers

భూమిలేని నిరుపేద కూలీలు 

తెలంగాణలోని భూమిలేని నిరుపేదలకు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇందులో భాగంగా మరో కీలక పథకాన్ని అమలు చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. భూమి లేని నిరుపేద కూలీలకు ఏటా రూ.12 వేలు చొప్పున ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. గడిచిన ఎన్నికలకు ముందు నిరుపేద కూలీలకు రూ.12 వేలు చొప్పున ఇస్తామని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. వచ్చే నెల నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నిరుపేద రైతు కూలీలకు అందించనున్న సాయం గురించి వెల్లడించారు. డిసెంబరు 28న కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భూమి లేని నిరుపేద రైతులకు రూ.12 వేలు చొప్పున అందిస్తామని ప్రకటించారు. ఏటా ఇచ్చే రూ.12 వేల సాయాన్ని రెండు విడతల్లో నిరుపేదలు ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. తొలి విడతగా ఆరు వేలు ఖాతాల్లో జమ చేయనున్నట్టు ప్రకటించారు. ఇది నిరుపేద రైతు కూలీలకు ఎంతో మేలు చేకూరుస్తుందని చెబుతున్నారు. 

రైతు భరోసా డబ్బులకు సంబంధించి కూడా డిప్యూటీ సీఎం క్లారిటీ ఇచ్చారు. సంక్రాంతి నుంచి రైతుల ఖాతాల్లో ఆ డబ్బులు వేయనున్నట్టు వెల్లడించారు. ఈ నిర్ణయం పట్ల రైతులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తోందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు వివిధ పథకాలు రూపంలో రూ.51 వేలు కోట్లు రైతులు కోసం ఖర్చు చేసినట్టు భట్టి వెల్లడించారు. ఈ పథకాలతో కాంగ్రెస్‌ పార్టీ రైతుల పక్షపాతి అని నిరూపించుకుంటోందని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. రైతులకు అండగా ఉండేలా మరిన్ని కార్యక్రమాలకు రూపకల్పన చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉందని పలువురు సీనియర్‌ నేతలు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా ఎన్నికల్లో భూమి లేని నిరుపేద కూలీ రైతులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేసే దిశగా అడుగులు ముందుకు వేస్తుండడం, అది కూడా ఈ నెలలోనే జమ చేసేందుకు ఏర్పాట్లు చేయడం పట్ల నిరుపేద రైతు కూలీలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్