తిరుపతి వెంకటేశ్వరస్వామి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు టీటీడీ అధికారులు అవకాశాన్ని కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల వినతిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం.. కొద్ది రోజుల్లోనే అవకాశం కల్పించాలని నిర్ణయించింది. తెలంగాణ ప్రజాప్రతినిధులు నుంచి వచ్చే సిఫార్సు లేఖలను అనుమతించడం లేదని నేతుల వ్యక్తం చేస్తున్న ఆందోళనలను టీటీడీ పరిష్కారం చూపింది. ఈ నెల 24 నుంచి ప్రజాప్రతినిధుల లేఖలను టీటీడీ అనుమతిస్తోంది. వారి సిఫార్సుపై దర్శన టికెట్లను కేటాయిస్తోంది. ఒక్కో ప్రజాప్రతినిధి రోజుకు ఒక్క లేఖ జారీ చేయడానికి అవకాశం ఇవ్వనున్నారు. ఆ లేఖపై ఆరుగురు దర్శనం చేసుకునేలా అవకాశం కల్పించనున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుపతి వెంకటేశ్వరస్వామి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు టీటీడీ అధికారులు అవకాశాన్ని కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల వినతిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం.. కొద్ది రోజుల్లోనే అవకాశం కల్పించాలని నిర్ణయించింది. తెలంగాణ ప్రజాప్రతినిధులు నుంచి వచ్చే సిఫార్సు లేఖలను అనుమతించడం లేదని నేతుల వ్యక్తం చేస్తున్న ఆందోళనలను టీటీడీ పరిష్కారం చూపింది. ఈ నెల 24 నుంచి ప్రజాప్రతినిధుల లేఖలను టీటీడీ అనుమతిస్తోంది. వారి సిఫార్సుపై దర్శన టికెట్లను కేటాయిస్తోంది. ఒక్కో ప్రజాప్రతినిధి రోజుకు ఒక్క లేఖ జారీ చేయడానికి అవకాశం ఇవ్వనున్నారు. ఆ లేఖపై ఆరుగురు దర్శనం చేసుకునేలా అవకాశం కల్పించనున్నారు. ఆదివారం, సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు, బుధవారం, గురువారం ప్రత్యేక దర్శనాలకు అవకాశం కల్పించనున్నారు. ఇటీవల తెలంగాణ ఎంపీ రఘునందన్‌రావు, మంత్రి కొండా సురేఖ టీటీడీ అధికారులు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను పట్టించుకోవడం లేదంటూ వ్యాఖ్యానించారు. దీనిపై కొండా సురేఖ సీఎం చంద్రబాబుకు లేఖ కూడా రాశారు. రఘునందన్ రావు తిరుమలలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ అంశం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో గతంలో ఇచ్చిన ఆదేశాలు మేరకు లేఖలను అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ ఎమ్మెల్యేలు లేఖలను టీటీడీ అధికారులు అనుమతించడం లేదు. దీనిపై తెలంగాణ ప్రజాప్రతినిధులు ఏపీ సీఎం చంద్రబాబును రిక్వెస్ట్ చేయడంతో ఈ మేరకు అనుమతించేందుకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గడిచిన నాలుగేళ్లుగా లేఖలు తీసుకోకపోవడంతో ఇబ్బంది తలెత్తుతోంది. టీటీడీ బోర్డును గతంలో ఎప్పుడు ఏర్పాటు చేసినా తెలంగాణ వారికి ఖచ్చితంగా అందులో ప్రాధాన్యం ఇస్తున్నారు. తాజాగా టీటీడీ బోర్డులోనూ తెలంగాణకు చెందిన ముగ్గురు సభ్యులుగా ఉన్నారు. అయితే, వారికి తమ అధికార పరిధి మేరకు సిఫార్సు లేఖలు ఇస్తున్నారు. ప్రజాప్రతినిధులకు మాత్రం చాన్స్ లేకుండా పోయింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. రేవంత్ రాసిన లేఖకు స్పందించిన చంద్రబాబు తెలంగాణ ఎంపీ, ఎమ్మెల్యేలు సిఫార్సు లేఖలకు అనుమతించేందుకు అంగీకరించారు. ఈ నిర్ణయాన్ని ఈ నెల 24 నుంచి అమలు చేసేందుకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తుండడంతో తెలంగాణ ప్రజాప్రతినిధులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.