తెలంగాణ రైతులకు శుభవార్త.. లక్ష లోపు రుణాలు మాఫీ నేడే

తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రైతులకు రుణమాఫీ పథకాన్ని గురువారం ప్రభుత్వం అమలు చేయబోతోంది. సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 110 రైతు వేదికల్లోని రైతులతో నిర్వహించే వీడియో క్యాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష రూపాయల రుణాల మాఫీని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం 11.5 లక్షల మంది రైతుల రుణ ఖాతాల్లో లక్ష వరకు జమ కానున్నాయి.

CM Revanth Reddy met with bankers

బ్యాంకర్లతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రైతులకు రుణమాఫీ పథకాన్ని గురువారం ప్రభుత్వం అమలు చేయబోతోంది. సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 110 రైతు వేదికల్లోని రైతులతో నిర్వహించే వీడియో క్యాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష రూపా  రుణాల మాఫీని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం 11.5 లక్షల మంది రైతుల రుణ ఖాతాల్లో లక్ష వరకు జమ కానున్నాయి. ఈ సందర్భంగా రైతు వేదికలలో జరిగే సంబరాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొననున్నారు. ఈ రైతు రుణమాఫీకి సంబంధించి అధికారులకు దిశా, నిర్దేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేశారు. గురువారం ఉదయం 11 గంటలకు అధికారులు, రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా రుణమాఫీ మార్గదర్శకాలు అమలుపై దిశ నిర్దేశం చేశారు. రుణమాఫీ కోసం అవసరమైన నిధులను ఆర్థిక శాఖ బుధవారం బ్యాంకులో జమ చేసింది. లక్షలోపు రుణమాఫీ వర్తించే రైతులు జాబితాలను బుధవారమే ప్రభుత్వం అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులకు పంపించింది.

స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతోపాటు అభ్యుదయ రైతులను, లబ్ధిదారులను, రైతుకు వేదికల వద్దకు ఆహ్వానించారు. గురువారం రుణమాఫీ నిధులు రైతుల రుణ ఖాతాల్లో జమ అయ్యాయనే సమాచారం ఫోన్లో వచ్చిన వెంటనే ఆయా రైతులను మంత్రులు ఎమ్మెల్యేలు అభినందించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో పలువురు మంత్రులు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతన్న రుణం తీర్చుకునే శుభతరుణం ఆసన్నమైందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట నెరవేర్చే శుభసంకల్పం ఇదేనని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. మంచి కార్యక్రమాన్ని ప్రశంసించకపోయినా పరవాలేదని కానీ, విమర్శించవద్దంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిపక్షాలకు సూచించారు. రైతు రుణమాఫీని మూడు పద్ధతుల్లో ఏకకాలంలో అమలు చేస్తూ రెండు లక్షల వరకు రుణమాఫీ చేయడం భారతదేశ చరిత్రలోనే చారిత్రాత్మక నిర్ణయంగా ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే మూడు దశల్లో చేయనున్న రుణమాఫీకి సంబంధించి నిధులను సమకూర్చుకునే పనిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ రూపొందించింది. సీఎం రేవంత్ రెడ్డితోపాటు, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి కీలక వివరాలను అందించి నిధులను సమకూర్చుకునే పనిలో పడ్డారు. ఈ రుణ మాఫీ బ్యాంకులతోపాటు ప్రాథమిక సహకార బ్యాంకుల్లో ఉన్న రుణాలకు వర్తింపజేశారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్