దసరా పండగ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే తన పరిధిలో దాదాపు 771 ప్రత్యేక రైళ్ళను నడపనుంది. డిమాండ్ కు అనుగుణంగా సీజన్ లో మరిన్ని రిజర్వుడు అండ్ రిజర్వ్ ప్రత్యేక రైలు నడిపేందుకు ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. పండగ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లు కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం, నాగర్ సోల్, మాల్దా టౌన్, గోరఖ్పూర్, దానాపూర్, రక్షాల్, నిజాముద్దీన్, బెర్హంపూర్, హౌరా రోడ్ లో దక్షిణ మధ్య రైల్వే ఈ ప్రత్యేక రైలు నడపనుంది.
రైలు కోసం కిక్కిరిసిన ప్రయాణికులు
రైలు ప్రయాణం చేయాలనుకుంటే ముందుగానే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పటికప్పుడు ప్రయాణాలు చేయాల్సి వచ్చి రైలు ఎక్కాలంటే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా పండగ సమయాల్లో రైళ్ల రద్దీతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతుంటారు. రిజర్వేషన్ల అవ్వక జనరల్ బోగీలో ప్రయాణాలు చేయలేక ఇబ్బందులు పడే ప్రయాణికుల సంఖ్య తక్కువేమీ కాదు. తాజాగా దసరా పండుగ నేపథ్యంలో సొంత ఊర్లకు వెళ్లాలనుకునే ప్రయాణికుల కోసం ఇండియన్ రైల్వే స్పెషల్ రైళ్లను ఏర్పాటు చేసింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు నిర్ణయాన్ని తీసుకున్నారు. పండగ నేపథ్యంలో ఊర్లకు వెళ్లే ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
దసరా పండగ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే తన పరిధిలో దాదాపు 771 ప్రత్యేక రైళ్ళను నడపనుంది. డిమాండ్ కు అనుగుణంగా సీజన్ లో మరిన్ని రిజర్వుడు అండ్ రిజర్వ్ ప్రత్యేక రైలు నడిపేందుకు ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. పండగ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లు కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం, నాగర్ సోల్, మాల్దా టౌన్, గోరఖ్పూర్, దానాపూర్, రక్షాల్, నిజాముద్దీన్, బెర్హంపూర్, హౌరా రోడ్ లో దక్షిణ మధ్య రైల్వే ఈ ప్రత్యేక రైలు నడపనుంది. ప్రతి సంవత్సరం దుర్గాపూజ, దీపావళి పండగ కోసం దేశ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రైళ్లలో జర్నీ చేస్తుంటారు. పండగల సీజన్ లో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండడంతో వెయిటింగ్ లిస్ట్ టికెట్లు కలిగిన వారికి స్పెషల్ ట్రైన్లు వల్ల ఊరట లభించనుంది. పండగల కోసం సంతూర్లకు వెళ్లే ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్ల సదుపాయాల సేవలను వినియోగించుకోవాలని రైల్వే అధికారులు కోరుతున్నారు ఇప్పటికే ఆయా రేలకు సంబంధించిన సేవలు ప్రారంభమైనట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.