బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. గడిచిన రెండు రోజుల నుంచి బంగారం ధర తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం బంగారం ధర భారీగా తగ్గుముఖం పట్టడంతో వినియోగదారులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల అమెరికా ప్రెసిడెంట్ గా డోనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత డాలర్ పుంజుకుంది. దీంతో బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి.
బంగారం
బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. గడిచిన రెండు రోజుల నుంచి బంగారం ధర తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం బంగారం ధర భారీగా తగ్గుముఖం పట్టడంతో వినియోగదారులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల అమెరికా ప్రెసిడెంట్ గా డోనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత డాలర్ పుంజుకుంది. దీంతో బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో నవంబర్ 5వ తేదీన స్పాట్ గోల్డ్ రేటు 200750 డాలర్ల లెవెల్స్ లో ఉండేది. అదే రోజు అమెరికా అధ్యక్షుడు ఎన్నికల ఫలితాలు తర్వాత సీన్ రివర్స్ అయింది. గోల్డ్ రేటు ఒకరోజులో దాదాపు 100 డాలర్ల మేర ప్రభావితమై 200650 డాలర్ల స్థాయికి చేరి మళ్ళీ కాస్త పెరిగింది. ఈ ఒక్క కారణంతోనే మరుసటి రోజు దేశీ మార్కెట్లలో కూడా బంగారం ధర భారీగా పడిపోయింది. తులంపై ఏకంగా రూ.1800 వరకు దిగివచ్చింది. ఆ తర్వాత మళ్లీ అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు మరోసారి తగ్గించగా స్పాట్ గోల్డ్ రేటు మరోసారి 2700 డాలర్ల పైకి చేరింది. ఇప్పుడు మళ్లీ ట్రంప్ గెలిచిన జోష్ లో డాలర్ ధర పుంజుకుంటూనే ఉండడంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్ళీ దిగి వస్తున్నాయి. నవంబర్ 11న మధ్యాహ్నం రెండు గంటల సమయంలో స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్ కు 2670 డాలర్ల దిగువన ఉంది. ఇక స్పాట్ సిల్వర్ ధర రూ.31.30 డాలర్ల స్థాయిలో కదలాడుతోంది. దేశీయంగా బంగారం ధరల విషయానికొస్తే హైదరాబాద్ నగరంలో బుధవారం 22 క్యారెట్స్ గోల్డ్ రేటు మరో రూ.550 తగ్గింది. దీంతో తులం రూ.72,200 గా ఉంది. అక్టోబర్ 31న రూ.74,550 వద్ద ఆల్ టైమ్ రికార్డు ధరకు చేరింది. అక్కడి నుంచి పది రోజుల వ్యవధిలోనే పసిడి ధర రూ.2350 తగ్గిందని చెప్పవచ్చు. ఇక 24 క్యారెట్ల గోల్డ్ రేట్ విషయానికొస్తే తులం 10 రోజుల కిందట రూ.81,330 ఉండగా, ఇప్పుడు రూ.78,760 కు చేరింది. సుమారు రూ.2,570 వరకు ధర తగ్గుముఖం పట్టింది.
ఇక వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. అక్టోబర్ 23న కేజీ సిల్వర్ రేటు హైదరాబాదు నగరంలో రూ.1.12 లక్షలుగా ఉండగా, 20 రోజుల్లోనే ఏకంగా రూ.10 వేల రూపాయలు తగ్గింది. రెండు మూడు రోజుల క్రిందటి వరకు రికార్డు స్థాయికి చేరుకొని కులం బంగారం ధర రూ.82,000 వరకు చేరింది. తాజాగా బంగారం ధర తగ్గుతూ వస్తూ రూ.78 వేల దిగువకు పడిపోతుండడంతో కొనుగోలుదారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక నగరాల వారీగా బంగారం రేటు పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.70,990 గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,430 వద్ద కొనసాగుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.70,840 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,280 గా ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.70,840 వద్ద ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,280 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.70,840 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,280 వద్ద కొనసాగుతోంది. హైదరాబాదులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.70,840 వద్ద ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,280 వద్ద కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నం లోని ఇదే ధర ఉంది.