మాస్టర్స్ డిగ్రీ, బీటెక్ విద్యార్థులకు శుభవార్త.. లక్ష రూపాయల వేతనంతో ఉద్యోగం.!

నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. మాస్టర్స్ డిగ్రీ, బీటెక్ పూర్తిచేసి గేట్లో పాస్ అయిన అభ్యర్థులకు భారీ వేతనంతో ఉద్యోగాలు అందించేందుకు ఒక సంస్థ ముందుకు వచ్చింది. ఇంటర్వ్యూ లో అర్హత సాధిస్తే లక్ష రూపాయల వేతనంతో ఉద్యోగాన్ని అందించనుంది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేసే ఉద్దేశంతో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏరోనాటిక్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ బెంగళూరులోని తమ కార్యాలయంలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత కలిగిన ఆసక్తి కలిగిన అభ్యర్థులనుంచి దరఖాస్తులను కోరుతోంది. ఆయా ఉద్యోగాలకు ఎంపిక అభ్యర్థులకు భారీ వేతనం చెల్లించనున్నారు.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. మాస్టర్స్ డిగ్రీ, బీటెక్ పూర్తిచేసి గేట్లో పాస్ అయిన అభ్యర్థులకు భారీ వేతనంతో ఉద్యోగాలు అందించేందుకు ఒక సంస్థ ముందుకు వచ్చింది. ఇంటర్వ్యూ లో అర్హత సాధిస్తే లక్ష రూపాయల వేతనంతో ఉద్యోగాన్ని అందించనుంది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేసే ఉద్దేశంతో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏరోనాటిక్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ బెంగళూరులోని తమ కార్యాలయంలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత కలిగిన ఆసక్తి కలిగిన అభ్యర్థులనుంచి దరఖాస్తులను కోరుతోంది. ఆయా ఉద్యోగాలకు ఎంపిక అభ్యర్థులకు భారీ వేతనం చెల్లించనున్నారు. నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే.  ఏరోనాటిక్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఏడిఏ) బెంగళూరులోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 21వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. వివిధ విభాగాలకు సంబంధించి మొత్తంగా 133 కాలేలను ఈ నియామక ప్రక్రియ ద్వారా భర్తీ చేయనున్నారు. ఏరోనాటిక్స్ డెవలప్మెంట్ ఏజెన్సీలో పలు రకాల ఉద్యోగాలను ఈ నియామక ప్రక్రియ ద్వారా భర్తీ చేస్తారు.

ఇందులో సైంటిస్ట్ బి, సైంటిస్ట్ శ్రీ విభాగాల్లో పలు ఖాళీలు ఉన్నట్లు చెబుతున్నారు. ఓవరాల్ గా కార్లకు సంబంధించి ఉన్న విభాగాలను పరిశీలిస్తే ఏరోనాటికల్, మెటలర్జీ, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి సైంటిస్ట్ బి కేటగిరి లో 103 పోస్టులు, సైంటిస్ట్ సి కేటగిరీలో 32 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏప్రిల్ 21వ తేదీ దరఖాస్తు చేసుకునేందుకు గడువుగా నిర్ణయించారు. ఈలోగా దరఖాస్తు చేసుకోవాలని సదరు సంస్థ అభ్యర్థులను కోరుతోంది. ఉద్యోగాన్ని బట్టి వయసును నిర్ధారించారు. 2025 ఏప్రిల్ 21 నాటికి సైంటిస్ట్ సి పోస్టులకు 40 ఏళ్ళు మించరాదు. సైంటిస్ట్ బి పోస్టులకు 35 ఏళ్లు మించరాదు. నిబంధనల ప్రకారం వయసు సడలింపు ఉంటుంది. ఓబీసీలకు మూడేళ్ల వయసు సడలింపు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయసు సడలింపును ఈ సంస్థ ఇచ్చింది. దివ్యాంగ అభ్యర్థులకు 10 ఏళ్ళ వయసు సడలింపు కల్పించింది. అభ్యర్థులు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపిక ప్రక్రియను ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా నిర్వహించనున్నారు. ఇంటర్వ్యూ విజయవంతంగా పూర్తి అయిన అభ్యర్థులకు ఉద్యోగాన్ని ఇవ్వనున్నారు. ఎంపికైన ఉద్యోగాన్ని బట్టి వేతనం ఉంటుంది. సైంటిస్ట్ బి పోస్టులకు నెలకు రూ.90,789, సైంటిస్ట్ సి పోస్టులకు రూ.1,08,073 చొప్పున వేతనం లభిస్తుంది. మరిన్ని వివరాలకు http://www.ada.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని సదరు సంస్థ సూచించింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్