గడచిన కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర సోమవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. బంగారంతో పాటు వెండి ధర కూడా తగ్గడంతో వినియోగదారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో తగ్గిన ధరలను బట్టి ప్రస్తుత రేట్లు ఇలా ఉన్నాయి. ఆదివారం 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.71,350గా నమోదు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.77,840 గా నమోదయింది.
బంగారం
గడచిన కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర సోమవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. బంగారంతో పాటు వెండి ధర కూడా తగ్గడంతో వినియోగదారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో తగ్గిన ధరలను బట్టి ప్రస్తుత రేట్లు ఇలా ఉన్నాయి. ఆదివారం 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.71,350గా నమోదు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.77,840 గా నమోదయింది. అదే సమయంలో వెండి ధర విషయానికి వస్తే ఆదివారం కిలో వెండి ధర రూ.92,600 గా ఉంది. సోమవారం 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.71,340 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.77,830 గా ఉంది. వెండి ధర విషయానికి వస్తే కిలో వెండి రూ.92,500 గా ఉంది. అలాగే హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.71,340 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.77,830 గా ఉంది. విశాఖ, విజయవాడలోనూ ఇదే ధర కొనసాగుతోంది. మరవైపు దేశ రాజధాని న్యూఢిల్లీలో మాత్రం 22 క్యారెట్ల బంగారం ధర రూ.71,490 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.77,849 గా ఉంది. రెండు ధరలు కూడా స్వల్పంగా తగ్గుముఖం పడ్డాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి రూ.99,800 ఉండగా, ముంబైలో రూ.92,500 కాగా, ఢిల్లీ, కోల్కతా, బెంగుళూరులో కేజీ వెండి ధర రూ.92,300 గా ఉంది. గడిచిన నాలుగైదు రోజులతో పోలిస్తే స్వల్పంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ ని బట్టి పరిశీలిస్తే రానున్న రోజుల్లో కూడా మరికొంత బంగారం ధరల్లో తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు.