నిరుద్యోగులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..

దేశంలోని నిరుద్యోగ యువతకు శుభవార్తను కేంద్ర ప్రభుత్వం అందించింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియంలో శాస్త్రవేత్తలు కావాలనుకునే యువతకు గొప్ప అవకాశాన్ని కల్పించేలా పలు ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని భావిస్తున్న వాళ్లు, అర్హత కలిగిన అభ్యర్థులు CSIR - IIP అధికారిక వెబ్సైట్ iip.res.in ను సంప్రదించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం శాస్త్రవేత్త పోస్టులకు ఖాళీలను ప్రకటించారు. ఆయా పోస్టులకు ఏప్రిల్ 14 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మే 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉంది. CSIR - IIP ఈ నియామకం ద్వారా 9 పోస్టులను భర్తీ చేయనుంది.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

దేశంలోని నిరుద్యోగ యువతకు శుభవార్తను కేంద్ర ప్రభుత్వం అందించింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియంలో శాస్త్రవేత్తలు కావాలనుకునే యువతకు గొప్ప అవకాశాన్ని కల్పించేలా పలు ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని భావిస్తున్న వాళ్లు, అర్హత కలిగిన అభ్యర్థులు CSIR - IIP అధికారిక వెబ్సైట్ iip.res.in ను సంప్రదించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం శాస్త్రవేత్త పోస్టులకు ఖాళీలను ప్రకటించారు. ఆయా పోస్టులకు ఏప్రిల్ 14 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మే 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉంది. CSIR - IIP ఈ నియామకం ద్వారా 9 పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం తొమ్మిది పోస్టుల్లో నాలుగు అన్ రిజర్వుడ్ పోస్టులు కాగా, ఒకటి ఆర్థికంగా బలహీనమైన విభాగానికి చెందిన వారికి, మరో పోస్టు షెడ్యూల్డ్ కులానికి చెందిన వారికి (బ్యాక్లాగ్), మరో పోస్టు షెడ్యూల్డ్ తెగకు, రెండు పోస్టులు ఇతర వెనుకబడిన తరగతులకు చెందిన వారికి కేటాయించారు. ఈ పోస్టులు పొందేందుకు రిక్రూట్మెంట్కు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 32 ఏళ్లుగా నిర్ణయించింది.

2025 మే 5వ తేదీ నాటికి 32 ఏళ్లకు మించకుండా వయసు ఉండాలి. నిబంధనల ప్రకారం రిజర్వు వర్గాలకు వయోపరిమితులో సడలింపు ఉంటుంది. ఆయా ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి లేదా సంస్థ నుంచి నోటిఫికేషన్ లో ఇచ్చిన సంబంధిత బ్రాంచ్లో ME/MTECH తోపాటు పీహెచ్డీ పూర్తి చేసి ఉండాలి. ఆయా పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నేలకు రూ.67,700 నుంచి రూ.2,08,700 వరకు వేతనాన్ని చెల్లిస్తారు. మరిన్ని వివరాల కోసం వెబ్సైట్లోకి వెళ్ళవచ్చు. భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ కింద పని చేస్తున్న కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) దేశంలోని ప్రముఖ పరిశోధనా సంస్థగా పేరుపొందింది. ఈ సంస్థ దాదాపు అన్ని శాస్త్ర, పరిశ్రమ రంగాల్లో ఉన్నత స్థాయి పరిశోధనలను నిర్వహిస్తుంది. ఇటువంటి ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలను చేయాలనుకునే నిరుద్యోగ యువత ఆకాంక్షలను నెరవేర్చే గొప్ప అవకాశం లభించింది. ఆయా ఖాళీలను భర్తీ చేసేందుకు సంస్థ సిద్ధమవుతుండడంతో నిరుద్యోగ యువత అర్హత కలిగిన వారు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. భారీ వేతనాలతో కూడిన ఉద్యోగం కావడంతో పోటీ కూడా అధికంగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే అందుకు అనుగుణంగా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళితే ఉద్యోగం సులభంగా సాధించవచ్చని చెబుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్