ఏపీలోని డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఉచితంగా శిక్షణ, స్టే ఫండ్

ఏపీలోని ఉపాధ్యాయ పోస్టులకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీ ప్రభుత్వానికి సంబంధించి విశాఖలోని ఏపీ స్టడీ సర్కిల్ లో ఉచితంగా శిక్షణ అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ స్టడీ సర్కిల్ లో మూడు నెలలపాటు డీఎస్సీ శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణకు ఎస్సీ యువతులు మాత్రమే అర్హులు. అది కూడా ఎస్జీటీ అభ్యర్థులకు మాత్రమే ఇక్కడ శిక్షణ ఇవ్వనున్నారు.

Candidates under training

శిక్షణలో ఉన్న అభ్యర్థులు

ఏపీలోని ఉపాధ్యాయ పోస్టులకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీ ప్రభుత్వానికి సంబంధించి విశాఖలోని ఏపీ స్టడీ సర్కిల్ లో ఉచితంగా శిక్షణ అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ స్టడీ సర్కిల్ లో మూడు నెలలపాటు డీఎస్సీ శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణకు ఎస్సీ యువతులు మాత్రమే అర్హులు. అది కూడా ఎస్జీటీ అభ్యర్థులకు మాత్రమే ఇక్కడ శిక్షణ ఇవ్వనున్నారు. అధికారులు ఇప్పటికే దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈనెల 27వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించారు. అర్హులైన అభ్యర్థులు https://mdfc.apcfss.in, https://jnanabhumi.ap.gov.in ఆన్లైన్ పోర్టల్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మూడు నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వడంతోపాటు భోజన, వసతి సదుపాయం కల్పిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు ధరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే, సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న స్టడీ సర్కిల్స్, ప్రభుత్వం కొన్ని ప్రైవేట్ శిక్షణ సంస్థల్లో ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

ఈ శిక్షణా కాలంలో ఎస్సీ అభ్యర్థులకు ఆయా శిక్షణ సంస్థలకు చెల్లించేందుకు బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులకు రూ.12000, డీఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులకు రూ.10,000 చొప్పున శిక్షణ సంస్థలకు ప్రభుత్వం చెల్లించనుంది. శిక్షణ తీసుకునే కాలంలో నేలకు రూ.4,500 చొప్పున స్టేఫండ్ ను ప్రభుత్వం ఎంపికైన అభ్యర్థులకు అందించనుంది. రూ.3000 రూపాయలు విలువచేసే మెటీరియల్ ఇవ్వనన్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా ఆయా జిల్లాల్లో ఉన్న బీసీ స్టడీ సర్కిల్ ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం శిక్షణా సంస్థలతో బిసి కార్పొరేషన్ అధికారులు ఒప్పందం చేసుకున్నారు. శిక్షణకాలంలో బీసీ అభ్యర్థులకు రూ.1500 చొప్పున స్టే ఫండ్ ఇవ్వనున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయా శాఖలకు చెందిన అధికారులు కోరుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్