మందుబాబులకు శుభవార్త.. డిసెంబర్ 31న మద్యం అమ్మకాలు అప్పటి వరకే.!

నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా డిసెంబర్ 31వ తేదీన పెద్ద ఎత్తున సంబరాలను జరుపుకుంటారు. ముఖ్యంగా మందుబాబుల ఎంజాయ్మెంట్కు ఆరోజు హద్దే ఉండదు. స్నేహితులతో కలిసి మందేసి పార్టీ చేసుకునే వారి సంఖ్య ఎంతో ఉంటుంది. అటువంటి మందుబాబులకు తాజాగా తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈనెల 31న నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్రంలో మద్యం అమ్మకాల వేళలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా డిసెంబర్ 31వ తేదీన పెద్ద ఎత్తున సంబరాలను జరుపుకుంటారు. ముఖ్యంగా మందుబాబుల ఎంజాయ్మెంట్కు ఆరోజు హద్దే ఉండదు. స్నేహితులతో కలిసి మందేసి పార్టీ చేసుకునే వారి సంఖ్య ఎంతో ఉంటుంది. అటువంటి మందుబాబులకు తాజాగా తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈనెల 31న నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్రంలో మద్యం అమ్మకాల వేళలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 31వ తేదీ అర్ధరాత్రి ఒంటిగంట వరకు మద్యం విక్రయాలకు అనుమతినిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని బార్లు, రెస్టారెంట్లు, ఈవెంట్లు, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ హోటల్స్ లో తెల్లవారుజాము ఒంటిగంట వరకు మద్యం విక్రయించవచ్చని ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనివల్ల ప్రత్యేకంగా నూతన సంవత్సర వేడుకలను నిర్వహించే నిర్వాహకులకు ఉపశమనం దక్కినట్టు అయింది. ప్రభుత్వం ఈ మేరకు అనుమతి ఇవ్వకపోతే కొన్ని రకాల ఇబ్బందులు ఎదురయ్యవని పలువురు ఈవెంట్ నిర్వాహకులు పేర్కొన్నారు. తాజా ఉత్తర్వుల్లో భాగంగా అన్ని వైన్ షాపులను ఆరోజు అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచుకోవచ్చని వెల్లడించింది.

అయితే ఈ వేడుకల్లో డ్రగ్స్ వాడకుండా, ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువచ్చిన మద్యం అమ్మకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని అధికారులను ఆదేశించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగే కార్యక్రమాలు, పార్టీలపై ప్రత్యేక నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఇటీవల జిల్లా అధికారులతో జరిగిన సమావేశంలో ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలహాసన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఇదిలా ఉంటే నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా డిసెంబర్ 31న పెద్ద ఎత్తున ఈవెంట్లు నిర్వహించేందుకు పలువురు ఈవెంట్ మేనేజర్లు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే స్పెషల్ రేట్లు పెట్టి టికెట్లు పెట్టి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అన్లిమిటెడ్ వైన్, అన్లిమిటెడ్ ఫుడ్ పేర్లతో ఈ స్పెషల్ పార్టీలకు ఏర్పాట్లను చేస్తున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా డిసెంబర్ 31 నైట్ పార్టీలు పెద్ద ఎత్తున జరుగుతాయని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా వేడుకలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలను జారీ చేశారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్