కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు దేవస్థానం బోర్డు శుభవార్తను చెప్పింది. ఏటా కొన్ని లక్షల మంది భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వెళుతుంటారు. స్వామివారి మాల ధారణలో వెళ్లి ఇరుముడులు సమర్పిస్తారు. అటువంటి ఈ దేవాలయానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక సదుపాయాన్ని దేవస్థానం బోర్డు తీసుకువచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ ఆలయాన్ని పర్యవేక్షించే ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు తాజాగా భక్తుల కోసం ఉచిత ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది.
అయ్యప్ప స్వామి ఆలయంలో భక్తులు
కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు దేవస్థానం బోర్డు శుభవార్తను చెప్పింది. ఏటా కొన్ని లక్షల మంది భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వెళుతుంటారు. స్వామివారి మాల ధారణలో వెళ్లి ఇరుముడులు సమర్పిస్తారు. అటువంటి ఈ దేవాలయానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక సదుపాయాన్ని దేవస్థానం బోర్డు తీసుకువచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ ఆలయాన్ని పర్యవేక్షించే ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు తాజాగా భక్తుల కోసం ఉచిత ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ నిర్ణయం ఇటీవల జరిగిన వివిధ రోడ్డు ప్రమాదాల్లో పలువురు అయ్యప్ప భక్తులు మరణించడం వల్ల తీసుకోవాల్సి వచ్చినట్లు ఆలయ బోర్డ్ అధికారులు వెల్లడించారు. ఈ బీమా పథకం ద్వారా యాత్రికులు ప్రమాదంలో మరణించినప్పుడు వారి కుటుంబాలకు రూ.5 లక్షల రూపాయల పరిహారం దక్కనుంది. ఇందులో భాగంగానే పథనంధిట్ట, కొల్లం, అలప్పుజ, ఇడుక్కి జిల్లాలో జరిగిన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన భక్తుల కుటుంబ సభ్యులకు ఈ పరిహారం అందనుంది. ఈ పథకం కోసం యాత్రికుల నుంచి ఎటువంటి రుసుము వసూలు చేయకూడదని నిర్ణయించారు. వర్చువల్ క్యూ పద్ధతి లేదా స్పాట్ బుకింగ్ చేసుకున్న భక్తులకు మాత్రమే ఈ ప్రమాద భీమా పథకం వర్తిస్తుందని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు (టీడబి) వెల్లడించింది. అదేవిధంగా శబరిమలలో పనిచేసే కార్మికుల కోసం టీడీబి మరో బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది.
శబరిమలను శుభ్రపరిచే, పంపా నుండి సన్నిధానం వరకు భక్తులను మోసుకెళ్లే ధోలీ కార్మికులు కూడా ఈ పథకంలో భాగంగా లాభపడునున్నారు. ఈ పథకం ప్రకారం ప్రమాదవశాత్తు మరణించిన, పూర్తిగా వైకల్యం సంభవించిన పది లక్షలు, పాక్షికవైకల్యం సంభవిస్తే ఐదు లక్షలు పరిహారం దక్కనుంది. ఈ బీమా కోసం అక్కడ పనిచేసే కార్మికులు రూ.499 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం ద్వారా శబరిమల ఆలయానికి సంబంధించిన యాత్రికులు, కార్మికుల భద్రతను పెంచేందుకు, వారి సంక్షేమానికి మార్గం చూపించేందుకు ఈ పరిష్కారాలు యాత్ర కోసం బలమైన రక్షణ కల్పిస్తూ ఆలయ ప్రాంతంలో పర్యాటకుల భద్రతను కార్మికుల సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లే దశగా ముందడుగు వేస్తుందని నిపుణులు చెబుతున్నారు. గత కొద్దిరోజులుగా అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు వచ్చే ఎంతో మంది భక్తులు తిరిగి వెళ్లే సమయంలో ప్రమాదాల బారినపడే మృతి చెందుతున్నారు. అటువంటి వారి కుటుంబాలకు అండగా ఉండాలన్న ఉద్దేశంతోనే దేవస్థానం బోర్డు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆలయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఏది ఏమైనా ఏ నిర్ణయం ద్వారా ఎంతో మంది భక్తులకు మేలు చేకూర్చాలని ఆలయ దేవస్థానం బోర్డు నిర్ణయించడం గొప్ప విషయంగా పలువురు పేర్కొంటున్నారు.