భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్తను అందించేలా కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఉద్యోగులతోపాటు రైతులకు కూడా ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. కరువు భత్యం రెండు శాతం పెంచేందుకు అంగీకరించిన ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మంచి వార్తను చెప్పింది. దీంతో 53 శాతం నుంచి 55 శాతం డీఏ పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే, గడిచిన 78 నెలల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాల్లో ఇది అత్యధిక పెరుగుదల కావడం గమనార్హం.
ప్రతీకాత్మక చిత్రం
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్తను అందించేలా కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఉద్యోగులతోపాటు రైతులకు కూడా ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. కరువు భత్యం రెండు శాతం పెంచేందుకు అంగీకరించిన ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మంచి వార్తను చెప్పింది. దీంతో 53 శాతం నుంచి 55 శాతం డీఏ పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే, గడిచిన 78 నెలల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాల్లో ఇది అత్యధిక పెరుగుదల కావడం గమనార్హం. కాగా, ఉద్యోగులకు డీఏను రెండు నెలల బకాయిలను కలిపి మార్చి నెల వేతనంతోపాటు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనిపై ఉద్యోగులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుత ద్రవ్యోల్బణ రేటు, వారి మూల వేతనం ఆధారంగా కరువు భత్యం చెల్లిస్తున్నారు. అయితే, పెన్సనర్లకు కరువు ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగులు, పెన్సనర్లుపై ద్రవ్యోల్భణ భారాన్ని తగ్గించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ద్రవ్యోల్భణ రేటు ఆధారంగా ప్రభుత్వం దీన్ని ఏడాదికి రెండుసార్లు మారుస్తుంది. కొత్త కరువు భత్యం రేటు జనవరి నుంచి జూన్ అర్ధ సంవత్సరానికి, తరువాత జూలై నుంచి డిసెంబర్ అర్ధ సంవత్సరానికి వర్తిస్తాయి. ప్రభుత్వం ప్రకటించిన కరువు భత్యం ప్రయోజనం ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రభుత్వ రంగ సంస్థల్లో అంటే ప్రభుత్వ సంస్థల్లో పనిచేసేవారికి మాత్రమే వర్తిస్తుంది. రెండు శాతం డీఏ పెంపుతో 48.56 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 68.55 లక్షల మంది పెన్సనర్లకు లాభం చేకూరుతుంది. తాజా కేబినెట్ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వంపై రూ.6,614 కోట్లు భారం పడనుంది. పెరిగిన డీఏ జనవరి 2025 నుంచి అమలులోకి రానుంది. చివరగా గతేడాది జూలైలో డీఏను 50 శాతం నుంచి 53 శాతానికి పెంచారు. ఏటా రెండుసార్లు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డీఏ పెంచుతూ వస్తుంది. పెరుగుతున్న ధరలకు పరిహారంగా ఉద్యోగులు, పెన్సనర్లకు డీఏ ఎంతో ఉపయోగపడుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు పెరుగుతున్న ద్రవ్యోల్భణం ప్రకారం వారి మూల వేతనాన్ని సర్ధుబాటు చేసుకోవడానికి ఇచ్చే మొత్తాన్ని డియర్‌నెస్ అలవెన్స్(డీఏ) అంటారు. పదేళ్ల తరువాత వేతన సంఘంలో ప్రాథమిక వేతనాన్ని నిర్ణయించడం జరుగుతుంది. అయితే, డీఏ ఉద్యోగుల జీతంలో కాలానుగుణ పెరుగుదలను నిర్ధారిస్తుంది.
మరోవైపు రైతులపై భారం తగ్గించేందుకు పోషక ఆధారిత ఎరువులపై కేంద్రం సబ్సిడీ ఇస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో పోషక ఆధారిత పీఅండ్‌కే ఎరువులకు రూ.37,216 కోట్ల సబ్సిడీ మంజూరు చేసింది. న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ పథకం కింద 28 రకాల పోషక ఆధారిత ఎరువులు గరిష్ట చిల్లర ధరను తయారీదారులు లేదా దిగుమతిదారులు తగిన స్థాయిలో నిర్ణయించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కోవిడ్ వచ్చినప్పటి నుంచి అంతర్జాతీయ మార్కెట్‌లో డీఏపీ ధరలు భాగా పెరిగాయి. రైతులు ప్రయోజనాలను కాపాడేందుకుఽ, ధరల అస్థిరతను తగ్గించేందుకు డీఏపీ గరిష్ట చిల్లర ధర 50 కిలోల బ్యాగ్‌కు రూ.1350కు పరిమితం చేసింది. దీనివల్ల దేశ వ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు మేలు చేకూరనుంది.