ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ దేశంలోనే 5జి సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది. జూన్ నుంచి 5 చేసే వాళ్లను విస్తరించేందుకు బిఎస్ఎన్ఎల్ ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ 5జి విస్తరణ ఈ ఏడాది జూన్ నాటికి ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ కు కోట్లాదిమంది వినియోగదారులు ఉన్నారు. తాజాగా బిఎస్ఎన్ఎల్ చేసిన ప్రకటనతో వారంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ 5జీ సేవలు ఎక్కడ నుంచి అందుబాటులోకి వస్తాయి అన్నదానిపై ఎవరికి స్పష్టత లేకుండా పోయింది. మొదట ఢిల్లీలో ఈ సేవలను ప్రారంభించేందుకు బిఎస్ఎన్ఎల్ సిద్ధమవుతోంది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ దేశంలోనే 5జి సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది. జూన్ నుంచి 5 చేసే వాళ్లను విస్తరించేందుకు బిఎస్ఎన్ఎల్ ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ 5జి విస్తరణ ఈ ఏడాది జూన్ నాటికి ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ కు కోట్లాదిమంది వినియోగదారులు ఉన్నారు. తాజాగా బిఎస్ఎన్ఎల్ చేసిన ప్రకటనతో వారంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ 5జీ సేవలు ఎక్కడ నుంచి అందుబాటులోకి వస్తాయి అన్నదానిపై ఎవరికి స్పష్టత లేకుండా పోయింది. మొదట ఢిల్లీలో ఈ సేవలను ప్రారంభించేందుకు బిఎస్ఎన్ఎల్ సిద్ధమవుతోంది. నెట్వర్క్ యూజ్ ఏ సర్వీస్ మోడల్ ను ఉపయోగించి కంపెనీ ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఢిల్లీ తరువాత మరిన్ని నగరాలకు ఈ సేవలను విస్తరించేందుకు సంస్థ ఏర్పాటు చేస్తోంది. 5జి సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత వినియోగదారులు వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ, మెరుగైన డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్, అధిక నాణ్యత గల కాల్స్ వంటి అనేక ప్రయోజనాలను వినియోగదారులు పొందుతారు. అదే సమయంలో బిఎస్ఎన్ఎల్ ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లతో పోటీపడేందుకు అవకాశం ఏర్పడుతుంది. గడిచిన ఏడాది బిఎస్ఎన్ఎల్ ఢిల్లీలో 5జి సేవలు పైలెట్ టెస్టింగ్ నిర్వహించింది. ఈ పరీక్షలు స్థానిక విక్రేతర సహాయంతో జరిగాయి.
మరోవైపు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ వంటి సంస్థలు బిఎస్ఎన్ఎల్ కోసం లక్ష కొత్త 4జి మొబైల్ టవర్ల ఏర్పాటు చేయడంలో సహాయపడుతున్నాయి. ఈ భాగస్వామ్యాలు బిఎస్ఎన్ఎల్ ఫై జి సేవలను మరింత మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషించనున్నాయి. బిఎస్ఎన్ఎల్ సంస్థను పునరుద్జీవింప చేయడానికి ప్రభుత్వం గడిచిన ఏడాది బడ్జెట్లో 80 వేల కోట్లకు పైగా కేటాయించింది. ఈ నిధులు బిఎస్ఎన్ఎల్ సామర్థ్యాలను పెంపొందించేందుకు, నూతన సాంకేతికలను అందిపుచ్చుకునేందుకు ఉపయోగపడుతుంది. ఈ చర్యల వల్ల బిఎస్ఎన్ఎల్ భవిష్యత్తుకు కొత్త మార్గాలను అందించేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో వినియోగదారులు వేగవంతమైన, నాణ్యమైన సేవలను కోరుకుంటున్నారు. ఈ క్రమంలో బిఎస్ఎన్ఎల్ ఫైజి సేవలు కూడా అందుబాటులోకి వస్తే అనేకమంది ఈ సేవలపై ఆసక్తి చూపేందుకు అవకాశం ఉంటుంది. గడిచిన ఏడాది జూలైలో ప్రైవేట్ టెలికాం కంపెనీలు రీఛార్జి ధరలు భారీగా పెంచాయి. దీంతో ప్రైవేట్ నెట్వర్కులకు సంబంధించిన వినియోగదారులు లక్షలాదిమంది ఒక్కసారిగా బిఎస్ఎన్ఎల్ కు మారారు. బిఎస్ఎన్ఎల్ రీఛార్జి ప్లాన్స్ ప్రైవేట్ కంపెనీ కంటే తక్కువ ధరలో ఉంటాయి. ఇప్పట్లో రీఛార్జ్ ధరలు పెంచే ఆలోచనలో బిఎస్ఎన్ఎల్ లేదు. దీంతో దేశవ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ వినియోగదారుల సంఖ్య పెరుగుతుంది. ఈ నేపథ్యంలో 5జి సేవలు అందుబాటులోకి వస్తే మరింతగా బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.