ఏపీ టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల చేసిన విద్యాశాఖ

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతోంది. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీను అధికారులు శనివారం రాత్రి విడుదల చేశారు. ఈనెల మూడు, నాలుగు తేదీల్లో జరిగిన పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్లో ఆన్సర్ కీ లను అందుబాటులో ఉంచింది. మిగిలిన పరీక్షలకు సంబంధించిన ఆన్సర్ కీ లను.. పరీక్ష జరిగిన మరుసటి రోజు విడుదల చేయనున్నారు.

Candidates appearing for TET exam

టెట్ పరీక్ష రాస్తున్న అభ్యర్థులు

ఏపీలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అందుకు అనుగుణంగా పోస్టులను బట్టి చేసేందుకు ప్రక్రియను ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతోంది. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీను అధికారులు శనివారం రాత్రి విడుదల చేశారు. ఈనెల మూడు, నాలుగు తేదీల్లో జరిగిన పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్లో ఆన్సర్ కీ లను అందుబాటులో ఉంచింది. మిగిలిన పరీక్షలకు సంబంధించిన ఆన్సర్ కీ లను.. పరీక్ష జరిగిన మరుసటి రోజు విడుదల చేయనున్నారు. ఆన్సర్ 'కీ'తోపాటు పరీక్ష ప్రశ్నాపత్రాలను సైతం విద్యాశాఖ విడుదల చేసింది అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసేందుకు అనుగుణంగా కాల్ సెంటర్లను ఏర్పాటు చేసింది.

ఆయా కాల్ సెంటర్ల నెంబర్లు 9398810958, 6281704160, 8121947387, 8125046997, 9398822554, 7995649286, 7995789286, 9505619127, 9963069286 నెంబర్లకు గాని ఈ మెయిల్ grievances.tet@apschooledu.in ద్వారా సంప్రదించవచ్చని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. ఏపీలో టెట్ పరీక్షకు 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు అక్టోబర్ మూడున ప్రారంభమైన కంప్యూటర్ ఆధారిత పరీక్షలు అక్టోబర్ 21 వరకు కొనసాగుతున్నాయి. విడుదల చేసిన ఆన్సర్ కీ లకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే త్వరలోనే అభ్యంతరాలను ఉన్నతాధికారులు స్వీకరించనున్నారు. అక్టోబర్ 27న తుది కీ విడుదల చేసి నవంబర్ 2రెండో ఫలితాలు విడుదల చేయనున్నారు. ఏపీ టెట్ పరీక్షలు అర్హత మార్కులను ఓసి అభ్యర్థులకు 60 శాతంగా, బీసీ అభ్యర్థులకు 50 శాతంగా, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 40 శాతంగా నిర్ణయించారు. ప్రస్తుతం ఏపీ టెట్ రాష్ట్రవ్యాప్తంగా 108 పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. ఏపీలోని 22 జిల్లాల్లో 95 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, హైదరాబాద్, ఖమ్మం, బెంగళూరు, చెన్నై, బరంపూర్, గంజాంలో కలిపి 13 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ పరీక్ష ఆన్లైన్ విధానంలో జరుగుతోంది. రెండు సెషన్లలో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్