ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్రంలో ప్రీమియం లిక్కర్ బ్రాండ్లు విక్రయించేందుకు ప్రీమియం స్టోర్లు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ స్టోర్లు ఏర్పాటుకు అనుమతిస్తూ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి అనుగుణంగా ఒకటి రెండు రోజుల్లో ఎక్సైజ్ కమిషనర్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
లిక్కర్ ప్రీమియం స్టోర్
మందుబాబులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ మధ్యకాలంలో మద్యం రేట్లను తగ్గించిన ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. నాణ్యమైన మధ్యాన్ని తక్కువ ధరకు అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చినా కూటమి ప్రభుత్వం అందుకు అనుగుణంగానే చర్యలను చేపడుతోంది. గత వైసిపి ప్రభుత్వం అనేక అడ్డగోలు బ్రాండ్లను తీసుకువచ్చే ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసిందంటూ కూటమి నాయకులు అప్పట్లో విమర్శలు చేశారు. తాము అధికారంలోకి వస్తే మంచి బ్రాండ్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు తక్కువ ధరకు అందిస్తామని వెల్లడించారు. అందుకు అనుగుణంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యమైన బ్రాండ్ల మద్యం విక్రయాలు ఏపీలో ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్రంలో ప్రీమియం లిక్కర్ బ్రాండ్లు విక్రయించేందుకు ప్రీమియం స్టోర్లు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ స్టోర్లు ఏర్పాటుకు అనుమతిస్తూ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి అనుగుణంగా ఒకటి రెండు రోజుల్లో ఎక్సైజ్ కమిషనర్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 చోట్ల ప్రీమియం స్టోర్లు ఏర్పాటుకు ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకుంది.
మున్సిపల్ కార్పొరేషన్లు, ప్రధాన నగరాల్లో మాత్రమే ఉండే వీటికి దరఖాస్తు రుసుము 15 లక్షలుగా ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. దరఖాస్తులు ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో సమర్పించాల్సి ఉంటుంది. లైసెన్స్ ఫీజు కింద ఏడాదికి కోటి రూపాయలు చెల్లించాలి. దీనిపై ఏటా పది శాతం చొప్పున ఫీజు పెరుగుతుంది. ఈ స్టోర్లకు ఒకేసారి ఐదేళ్ల కాలానికి లైసెన్సులు జారీ చేస్తారు. కనీసం నాలుగువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భావన చూపించిన వాళ్లే దరఖాస్తు చేయడానికి అర్హులుగా పేర్కొన్నారు. దరఖాస్తులు పరిశీలించి లైసెన్సీలను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం ఒక కమిటీని నియమించనుంది. సాధారణ మద్యం షాపులు తరహాలోనే ఈ స్టోర్లు పని వేళలు ఉంటాయి. ప్రీమియం స్టోర్లలో లిక్కర్ బీర్, వైన్ తో పాటు లిక్కర్, చాక్లెట్లు, సిగార్సు, సిగరెట్లు, సాఫ్ట్ డ్రింకులు కూడా విక్రయించేందుకు అవకాశం ఉంటుంది. కొద్దిరోజుల కిందటే మద్యం షాపులను రాష్ట్రవ్యాప్తంగా లాటరీ విధానంలో ప్రభుత్వం కేటాయించింది. దరఖాస్తుకు 2 లక్షలు గా ప్రభుత్వం ఫీజును నిర్ణయించి ఈ షాపులను కేటాయించింది. భారీగా ఆదాయం వస్తుందన్న ఉద్దేశంతో వేలాదిమంది దరఖాస్తు చేసుకున్నారు. దుకాణాలు దక్కించుకున్న ఎంతోమంది తగిన ఆదాయం రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రీమియం స్టోర్ల ఏర్పాటుకు సంబంధించి ఎంతమంది ముందుకు వస్తారు అన్నదానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.