బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. రోజురోజుకు ఆకాశాన్ని అంతేలా ధరలు పెరుగుతుండడంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల కోసం బంగారం కొనుగోలు చేయాలనుకునే వారంతా పెరిగిన ధరలను చూసి భయపడుతున్నారు. దీపావళి పండుగ నేపథ్యంలో మరోసారి బంగారం ధరలు పెరిగాయి.
బంగారం ధర
బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. రోజురోజుకు ఆకాశాన్ని అంతేలా ధరలు పెరుగుతుండడంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల కోసం బంగారం కొనుగోలు చేయాలనుకునే వారంతా పెరిగిన ధరలను చూసి భయపడుతున్నారు. దీపావళి పండుగ నేపథ్యంలో మరోసారి బంగారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల తులం బంగారం ధర మళ్లీ రూ.75 వేల మార్కుకు చేరువ కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.82 వేలకు చేరువైంది. గడచిన మూడు రోజుల్లోనే 22 క్యారెట్ల బంగారంపై రూ.1400, 24 క్యారెట్ల బంగారంపై రూ.1530 మేరకు ధర పెరిగింది. శుక్రవారం కూడా మరోసారి బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. దేశంలోని అనేక నగరాల్లో శుక్రవారం బంగారం, వెండి ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.74,710 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.81,490 వద్ద కొనసాగుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.74,560 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.81,340 గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.75,560 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.81,340 కి చేరింది. కోల్కతాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.74,560 వద్ద ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.81,340 కి చేరింది.
తెలుగు రాష్ట్రాల్లో కూడా బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. హైదరాబాదులో శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.74,560 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.81,340 కి చేరింది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.74,560 కి చేరుకోగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.81,340 వద్ద ఉంది. విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.74,560 వద్ద ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.81,340 కి చేరింది. బంగారంతోపాటు వెండి ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. కిలో వెండి 100 వరకు పెరిగింది. ఢిల్లీతోపాటు ముంబై, కోల్ కతా, పూణేలో కిలో వెండి ధర రూ.99,900గా ఉండగా, హైదరాబాద్, చెన్నై, విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ.1,08,900కు చేరింది. బంగారం వెండి ధరలు పెరగడంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. సాధారణ, మధ్యతరగతి ప్రజలు బంగారం, వెండి కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడిందంటూ పలువురు పేర్కొంటున్నారు.