టీటీడీలో నెయ్యి వివాదం.. తిరుమలకు వేయి ఆవులు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన బడా నేత.!

నెయ్యి కల్తీకి సంబంధించిన వ్యవహారంపై విచారణ జరుగుతుండగా.. మరోవైపు రాజకీయ విమర్శలు ఈ వ్యవహారంపై సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీకి చెందిన ప్రముఖ రాజకీయ నేత కీలక ప్రకటన చేశారు. టీటీడీ బయట నుంచి నెయ్యి కొనుగోలు చేయడం వల్ల కల్తీ వంటి ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో.. ఇటువంటి ఇబ్బందులకు ఆస్కారం లేకుండా టీటీడీకి అవసరమైన నెయ్యి తయారు చేసుకునేందుకు అనుగుణంగా వేయి ఆవులను ఇస్తానంటూ ఆయన ప్రకటించారు.

BCY National President Bode Ramachandra Yadav

భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్

తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రంగా కొద్ది రోజుల నుంచి వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. స్వామివారికి నైవేద్యంగా పెట్టే ప్రసాదం, భక్తులకు అందించే లడ్డు తయారీకి వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగింది అంటూ సాక్షాత్తు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై ప్రభుత్వం విచారణకు సిట్ ను నియమించింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఈ కేసును విచారించి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఒకవైపు నెయ్యి కల్తీకి సంబంధించిన వ్యవహారంపై విచారణ జరుగుతుండగా.. మరోవైపు రాజకీయ విమర్శలు ఈ వ్యవహారంపై సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీకి చెందిన ప్రముఖ రాజకీయ నేత కీలక ప్రకటన చేశారు. టీటీడీ బయట నుంచి నెయ్యి కొనుగోలు చేయడం వల్ల కల్తీ వంటి ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో.. ఇటువంటి ఇబ్బందులకు ఆస్కారం లేకుండా టీటీడీకి అవసరమైన నెయ్యి తయారు చేసుకునేందుకు అనుగుణంగా వేయి ఆవులను ఇస్తానంటూ ఆయన ప్రకటించారు. ప్రస్తుతం ఈ ప్రకటన రాజకీయంగా, ఆధ్యాత్మికంగా సంచలనంగా మారింది. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రముఖ నాయకుడు, భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ ఈ మేరకు ఆవులను అందించేందుకు ముందుకు వచ్చారు. టీటీడీకి తాను వెయ్యి గోవులను ఇస్తానని, వాడితో డైరీ ఫార్మ్ ఏర్పాటు చేసి ఆ నెయ్యిని లడ్డు ప్రసాదాలకు ఉపయోగించాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఆయన లేఖ రాశారు. టీటీడీకి సొంత డెయిరీ ఎందుకు ఉండకూడదని ప్రశ్నించిన ఆయన.. ప్రభుత్వం కనుక డెయిరీ ఏర్పాటుకు సిద్ధంగా ఉంటే తాను వెయ్యి ఆవులను అందిస్తానని స్పష్టం చేశారు. మరో లక్ష గోవులను ఉచితంగా తిరుమలకు తరలించే బాధ్యతను కూడా తాను తీసుకుంటానని స్పష్టం చేశారు. లక్ష ఆవులు నుంచి రోజుకు 10 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అయిన దాదాపు 50 వేల కేజీలు వెన్న వస్తుందని, దాని నుంచి సుమారు 30 వేల కేజీలు నెయ్యి ఉత్పత్తి అవుతుందని స్పష్టం చేశారు. ఆ నెయ్యిని స్వామి వారి ధూప, దీప, నైవేద్యాలు, లడ్డు తయారీ కోసం ఉపయోగించవచ్చని ఆ లేఖలో రామచంద్ర యాదవ్ స్పష్టం చేశారు. మిగిలిన నెయ్యిని లడ్డు తయారీలు కోసం ఉపయోగించవచ్చని స్పష్టం చేశారు. ఇంకా మిగిలితే లేని ఇతర ఆలయాలకు కూడా సరఫరా చేయవచ్చని స్పష్టం చేశారు. దీనివల్ల నెయ్యి కల్తీ వంటి వ్యవహారాలకు ఆస్కారం ఉండదని వెల్లడించారు. 

టీటీడీ పాలకమండలిలో ఆధ్యాత్మిక గురువులు ధార్మిక ప్రతినిధులకు చోటు కల్పించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. బోడె రామచంద్ర యాదవ్ చేసిన ఈ ప్రకటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. భక్తులు, ఆధ్యాత్మిక గురువులు ఈ ప్రకటనను స్వాగతిస్తున్నారు. రామచంద్ర యాదవ్ కోరిన డెయిరీ ఏర్పాటుకు సంబంధించిన అంశంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. తిరుమల ఆలయానికి సొంత డెయిరీ ఉండాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. తాజాగా రామచంద్ర యాదవ్ ప్రకటన తర్వాత ఈ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. డెయిరీ నిర్వహణలో కొన్ని రకాల ఇబ్బందులు ఉండటం వల్లే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు దీనికి ముందుకు రావడం లేదు. అయితే, రామచంద్ర యాదవ్ తాజాగా ముఖ్యమంత్రికి లేఖ రాసిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఏదైనా కథలకు వస్తుందా.? లేదా.? అన్నది చూడాల్సి ఉంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్