ఘాటెక్కిన ఉల్లి.. భారీగా పెరిగిన ధరతో అల్లాడుతున్న వినియోగదారులు

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు. అందుకే ప్రతి వంటకంలోనూ తప్పనిసరిగా ఉల్లిని వినియోగిస్తారు. అయితే ప్రస్తుతం ఉల్లి ధర భారీగా పెరిగిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధర పెరిగిపోవడంతో వినియోగదారులపై భారీగా భారం పడుతుంది. నెల రోజులుగా ఉల్లిపాయ ధర గణనీయంగా పెరుగుతుండడంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. 15 రోజుల్లో ఉల్లి ధర రెట్టింపు కావడం ప్రస్తుతం ఆందోళనకు కారణం అవుతోంది. ప్రస్తుతం కిలో ఉల్లి ధర సగటున రూ.60 రూపాయలుగా ఉంది.

Onions at farmers markets
రైతు బజార్లలో ఉల్లి

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు. అందుకే ప్రతి వంటకంలోనూ తప్పనిసరిగా ఉల్లిని వినియోగిస్తారు. అయితే ప్రస్తుతం ఉల్లి ధర భారీగా పెరిగిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధర పెరిగిపోవడంతో వినియోగదారులపై భారీగా భారం పడుతుంది. నెల రోజులుగా ఉల్లిపాయ ధర గణనీయంగా పెరుగుతుండడంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. 15 రోజుల్లో ఉల్లి ధర రెట్టింపు కావడం ప్రస్తుతం ఆందోళనకు కారణం అవుతోంది. ప్రస్తుతం కిలో ఉల్లి ధర సగటున రూ.60 రూపాయలుగా ఉంది. జిల్లాల వారీగా చూస్తే లభ్యత, డిమాండ్ ను బట్టి ధరల్లో వ్యత్యాసాలు ఉన్నాయి. అనేక జిల్లాల్లో కిలో ఉల్లి ధర 80 కి ఎగబాకింది. ప్రస్తుతమున్న పరిస్థితి కొనసాగితే మరో వారం రోజుల్లో ఉల్లి ధర సెంచరీ దాటే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు ఆందోళన చేస్తున్నాయి. మహారాష్ట్ర, కర్నూలు నుంచి ఉల్లిగడ్డల సరఫరా తగ్గడమే ధరల పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. కర్నూలులో ఉల్లి విస్తీర్ణం 75 వేల ఎకరాల నుంచి 20వేల ఎకరాలకు పడిపోవడంతో దిగుబడి గణనీయంగా తగ్గింది. మహారాష్ట్రలోను అకాల వర్షాలతో పంట నష్టం జరిగింది. దీంతో ఆయా రాష్ట్రాల్లోనూ దిగుబడి భారీగా తగ్గుముఖం పట్టడంతో డిమాండ్ కు అనుగుణంగా సరఫరా చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ధరలు అమాంతం పెరుగుతున్నట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు.

పది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేసిన తర్వాత ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నట్లు మార్కెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఉల్లి ధరలు నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం 4.7 లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి కరే ఒక ప్రకటన విడుదల చేశారు. ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు తొలగించడంతో ధరలు అంతకంతకు పెరుగుతున్నాయని దేనితో బఫర్ స్టాక్ ను విడుదల చేశామని వెల్లడించారు ఖరీఫ్ సాగు ఉత్పత్తులతో ఉల్లి ధరలు అదుపులోకి వస్తాయని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఢిల్లీలో ఉల్లి ధర కిలో రూ.55 ఉండగా మొబైల్ కేంద్రాల ద్వారా రూ.35 విక్రయిస్తున్నట్టు వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతు బజార్లలో కూడా ఉల్లిపాయ ధర భారీగానే పలుకుతోంది. హైదరాబాదులోని అనేక రైతు బజార్లో కిలో ఉల్లి ధర రూ.60 రూపాయలు ఉండగా, ఏపీలోనే అనేక జిల్లాల్లో రూ.40 నుంచి రూ.60 మధ్య రైతు బజార్లో విక్రయిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ ధర మరింత పెరిగే ఛాన్స్ ఉండడంతో ముందుగానే వినియోగదారులు భారీగా కొనుగోలు చేసి నిలవబెట్టుకుంటున్నారు దీంతో డిమాండ్ మరింత పెరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్