భద్రాద్రి రామయ్య తలంబ్రాలు కావాలా.. ఇలా ఇంటికే తెప్పించుకోండి

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ప్రతీకాత్మక చిత్రం||


మార్చి 30 శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి  శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవలోని తలంబ్రాలను భక్తులకు అందజేసేందుకు టీఎస్ఆర్టీసీ బుధవారం శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్‌ పోస్టర్‌ ను టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఆవిష్కరించారు. గత సంవత్సరంలో టీఎస్‌ఆర్టీసీ కార్గో నిర్వహించిన మాదిరిగానే ఈ సంవత్సరం కూడా భక్తులకు ఇంటి వద్దకే స్వామివారి తలంబ్రాలు అందజేయనున్నారు. ఇందుకు రూ. 116 చెల్లించి బుక్ చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని టీఎస్‌ఆర్టీసీ కార్గో కౌంటర్లలో బుక్ చేసుకునే అవకాశం ఉందని తెలిపింది. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకునేందుకు భక్తులు టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్‌ ఫోన్‌ నంబర్లు 9177683134, 7382924900, 9154680020ను పూర్తి వివరాలు తెలుసుకొని సంప్రదించవచ్చు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తొలి రసీదును రూ. 116 చెల్లించి బుక్ చేసుకున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్