ఏపీలో కల్లోలం సృష్టిస్తున్న జీబీఎస్.. క్రమంగా పెరుగుతున్న కేసులు

రాష్ట్రంలో గులియన్ బారే సిండ్రోమ్ (జిబిఎస్) కేసులు భారీగా నమోదవుతున్నాయి. మరణాలు సంభవిస్తుండడం ప్రస్తుతం ఆందోళనకు కారణం అవుతుంది. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో ఆరేళ్ల బాలుడు జీబీఎస్ భారినపడి మరణించగా.. తాజాగా ప్రకాశం జిల్లా కు చెందిన యాభై ఏళ్ల మహిళ ఈ వ్యాధితో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. వెంటనే అప్రమత్తమైన ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు రంగంలోకి దిగి కొన్నిచోట్ల ప్రత్యేక చికిత్సకు ఏర్పాటు చేశారు.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

రాష్ట్రంలో గులియన్ బారే సిండ్రోమ్ (జిబిఎస్) కేసులు భారీగా నమోదవుతున్నాయి. మరణాలు సంభవిస్తుండడం ప్రస్తుతం ఆందోళనకు కారణం అవుతుంది. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో ఆరేళ్ల బాలుడు జీబీఎస్ భారినపడి మరణించగా.. తాజాగా ప్రకాశం జిల్లా కు చెందిన యాభై ఏళ్ల మహిళ ఈ వ్యాధితో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. వెంటనే అప్రమత్తమైన ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు రంగంలోకి దిగి కొన్నిచోట్ల ప్రత్యేక చికిత్సకు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆసుపత్రిలోనూ ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 59 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇందులో 14 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. మిగిలినవారు వ్యాధి నుంచి కోలుకొని ఇంటికి చేరుకున్నారు. చికిత్స నుంచి కోలుకొని వెళ్లిన వారి పైన ఆరోగ్య శాఖ దృష్టి సారించి పర్యవేక్షిస్తోంది. 

జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు 

జేబీఎస్ కేసులు పెరుగుతుండడంతో అప్రమత్తంగా ఉండాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఈ వ్యాధి లక్షణాలు విచిత్రంగా ఉండడంతో ఎవరికి అంతుపట్టడం లేదు. ఏ మందు వేసుకోవాలో తెలియడం లేదని చెబుతున్నారు. సకాలంలో వైద్యుల వద్దకు వెళ్ళకపోతే మృత్యువాత చిందే అవకాశం ఉంది. జిపిఎస్ లక్షణాలు అందరికీ ఒకేలా ఉంటాయని చెప్పలేం. కొంతమందికి దగ్గు, జ్వరంతోపాటు వెంటనే కాళ్లు పట్టేయడం జరుగుతుంది. కొంతమందికి విరేచనాలతో లక్షణాలు ప్రారంభమవుతాయి. ఏదైనా చివరికి నరాల మీద ప్రభావం చూపి శరీరంలోని నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. నరాల సమస్యలు ఉన్నవారు అత్యంత జాగ్రత్త తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వ్యాధి శరీరంలోకి ప్రవేశించగానే సాధారణ వ్యాధి లక్షణాలతో ప్రారంభమై జలుబు, దగ్గు, విరేచనాలు, కాళ్లు పట్టేయడం తదితర లక్షణాలు మొదలవుతాయి. ఆ సమస్యలను తగ్గించడానికి మన శరీరంలో యాంటీ బాడీలను సిద్ధం చేస్తుంది. ఈ యాంటీ బాడీలో అధికంగా ఉత్పత్తి కావడంతో అవి తిరిగి శరీరాన్ని డ్యామేజ్ చేస్తాయి. యాంటీ బాడీలో శరీరంలోని మొత్తం నరాల వ్యవస్థ పై దాడి చేయడం ప్రారంభించి నెమ్మదిగా మెదడుపై ప్రభావం చూపుతాయి. శ్వాస సంబంధిత సమస్యలు, నీరసం ఏర్పడతాయి. ఇదంతా కేవలం పది నుంచి 15 రోజుల వ్యవధిలో జరిగిపోతుంది. కాబట్టి న్యూరాలజీ సమస్యలు ఉన్నవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలనే నిపుణులు సూచిస్తున్నారు. జీబీఎస్ ఎక్కువగా చిన్నారులు, వృద్ధులపై ప్రభావం చూపుతోంది. చాలామంది చిన్నారులు తమకు వచ్చే అనారోగ్య సమస్యలను స్పష్టంగా చెప్పలేరు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ముఖ్యంగా చిన్నారులకు ఆహారంగా ఇచ్చే పాలు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పాలవల్ల జిపిఎస్ ఎఫెక్ట్ అవుతోంది. కాబట్టి బాగా వేడి చేసిన పాలన మాత్రమే చిన్నారులకు అందించాలి. మంచినీళ్లను కూడా కాచి చల్లార్చిన తర్వాతే వాడడం మంచిది. ఈ వ్యాధి అంటూ వ్యాధి కాదు. కానీ ఏ రూపంలో శరీరంలోకి ప్రవేశిస్తుందో చెప్పలేని పరిస్థితి. కాబట్టి చిన్నారులు విరుద్ధులతో పాటు ప్రతి ఒక్కరూ కరోనా సమయంలో పాటించిన జాగ్రత్తలు పాటించడం మంచిది అని నిపుణులు సూచిస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్