(Pic: గంగాధర రైల్వే గేట్)
ఈవార్తలు, కరీంనగర్ న్యూస్: దక్షిణ మధ్య రైల్వేలో పలు చోట్ల ట్రాక్ నిర్వహణ పనులు కొనసాగుతున్నాయి. దీని దృష్ట్యా పలు ప్రాంతాల్లో రోడ్డు మళ్లింపు చర్యలు చేపడుతున్నారు. కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్-జగిత్యాల రహదారిపై ఉన్న గంగాధర రైల్వే ట్రాక్ వద్ద పనులు కొనసాగుతుండడంతో రైల్వే అధికారులు సమీప గ్రామాలకు వెళ్లే రోడ్డును మూసివేయాలని నిర్ణయించారు. జనవరి 2వ తేదీ వరకు ట్రాక్ నిర్వహణ పనులు కొనసాగుతున్నందున ఆ దిశగా రోడ్డును మూసివేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే-కరీంనగర్ అధికారులు పేర్కొన్నారు. సమీప గ్రామాల నుంచి అటు వైపుగా వచ్చే వాహనాలు పూడూర్ వద్ద డైవర్షన్ తీసుకొని వెళ్లాలని సూచించారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని కొడిమ్యాల ఎమ్మార్వోకు లేఖ రాశారు. అయితే, జగిత్యాల, నిజామాబాద్ నుంచి వచ్చే వాహనాలు ఎలాంటి అవరోధం లేకుండా కరీంనగర్ వైపు వెళ్లవచ్చని, గంగాధర రైల్వే గేట్ మూసివేయటం లేదని అధికారులు వెల్లడించారు.
(దక్షిణ మధ్య రైల్వే అధికారుల లేఖ)