స్నేహితుడు పెళ్లికి వెళ్లిన పలువురు ఆమెకు కాబోయే భార్యతో బాండ్ పేపర్ పై సంతకాన్ని పెట్టించుకున్నారు. పెళ్లి తర్వాత కూడా తాము ఇది వరకు ఎలా కలిసి మెలిసి తిరిగామో, ఎంజాయ్ చేసామో, అలానే తిరిగేందుకు అవకాశం కల్పించాలని, వాటికి అడ్డు చెప్పకూడదంటూ తమ స్నేహితుడి కాబోయే భార్యకు షరతులు విధించారు. అంతేకాకుండా ఈ మేరకు బాండ్ పేపర్ పై సంతకాలు చేయించుకున్నారు. ఈ ఘటన తమిళనాడులోని మైలాడుదురై జిల్లా శీర్గాలి సమీపంలో చోటుచేసుకుంది. తెన్ పాదికి చెందిన ముత్తు కుమార్ - పవిత్రల వివాహం శీర్గాలి సమీపంలోని ఒక కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది.
పెళ్లి జంట
'పెళ్లి తర్వాత వాడు పూర్తిగా మారిపోయాడు రా' స్నేహితుల మధ్య ఎక్కువగా వినిపించే మాట ఇది. ఎందుకంటే వివాహానికి ముందు ప్రతిరోజు కలుసుకునే ఎంతో మంది స్నేహితులు వివాహం తర్వాత అసలు కలిసేందుకు కూడా సమయాన్ని కేటాయించరు. కొందరు అయితే స్నేహితులతో రోజువారి మాటలు ఆడేందుకు కూడా ఇష్టపడరు. అప్పటి వరకు ప్రతిరోజు గంటలు తరబడి గడిపిన ఎంతో మంది స్నేహితులకు ఇది ఇబ్బందికరంగా మారుతోంది. ఇటువంటి ఇబ్బంది తమ స్నేహితుడితో ఎదురు కాకూడదన్న ఉద్దేశంతో కొందరు స్నేహితులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. తమ స్నేహితుడు పెళ్లికి వెళ్లిన పలువురు ఆమెకు కాబోయే భార్యతో బాండ్ పేపర్ పై సంతకాన్ని పెట్టించుకున్నారు. పెళ్లి తర్వాత కూడా తాము ఇది వరకు ఎలా కలిసి మెలిసి తిరిగామో, ఎంజాయ్ చేసామో, అలానే తిరిగేందుకు అవకాశం కల్పించాలని, వాటికి అడ్డు చెప్పకూడదంటూ తమ స్నేహితుడి కాబోయే భార్యకు షరతులు విధించారు. అంతేకాకుండా ఈ మేరకు బాండ్ పేపర్ పై సంతకాలు చేయించుకున్నారు. ఈ ఘటన తమిళనాడులోని మైలాడుదురై జిల్లా శీర్గాలి సమీపంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తెన్ పాదికి చెందిన ముత్తు కుమార్ - పవిత్రల వివాహం శీర్గాలి సమీపంలోని ఒక కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి ముత్తుకుమార్ స్నేహితులు హాజరయ్యారు. సాధారణంగా స్నేహితుడి వివాహానికి వచ్చేవాళ్లు ఖరీదైన బహుమతులు తీసుకు వస్తారు. కానీ ముత్తుకుమార్ స్నేహితులు మాత్రం రూ.100 రూపాయల బాండ్ పేపర్ తో వచ్చారు. వివాహానికి ముందే తమ స్నేహితుడి భార్యతో మాట్లాడారు. తామంతా కలిసి మెలిసి తిరుగుతున్నామని, నిత్యం కలుస్తూ ఉంటామని, పెళ్లి తర్వాత తమ స్నేహానికి ఎటువంటి ఆటంకం లేకుండా చూడాలని కోరారు. అంతే కాకుండా వంద రూపాయలు బాండ్ పత్రంపై వధువు చేత ఈ మేరకు సంతకం కూడా తీసుకున్నారు. వివాహం తర్వాత కూడా ముత్తు కుమార్ అతని స్నేహితులతో కలిసి తిరిగేందుకు, విహార యాత్రలు చేసేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, అతని సరదాలకు తాను ఎలాంటి అడ్డు చెప్పబోను అని ఆ అగ్రిమెంట్ పత్రంపై రాసి ఉంది. ఈ పత్రం చదువుకున్న వధువు, ఆమె కుటుంబీకులు ఈ వ్యవహారాన్ని సరదాగా తీసుకొని సంతకం చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. తమ ఫ్రెండ్ తమతో తిరిగేందుకు అభ్యంతరం లేకుండా ఆమె భార్యతో సంతకం చేయించుకున్న తర్వాతే పెళ్లి ప్రక్రియ ముందుకు వెళ్లేలా చేయడం ద్వారా ఆ స్నేహితులు సరికొత్త వ్యవహారానికి నాంది పలికినట్లు అయిందని పలువురు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా తమ స్నేహ జీవితానికి పెళ్లి అనే ప్రక్రియ అడ్డు కాకూడదు అన్న ఉద్దేశంతోనే స్నేహితులు ఈ పనికి పూనుకున్నట్టు చెబుతున్నారు. ఈ స్నేహితుల మధ్య ఉన్న అనుబంధాన్ని అర్థం చేసుకున్న ఆ యువతి కూడా సంతకం చేయడం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం అవుతోంది. ప్రతి భార్య ఇలానే ఆలోచిస్తే స్నేహితులు మధ్య దూరం పెరగదని పలువురు పేర్కొంటున్నారు.
సాధారణంగా పెళ్లి తరువాత భార్య ఒప్పుకోవడం లేదంటూ ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయంటూ ఎంతోమంది స్నేహితులతో కలిసి చేసుకునే పార్టీలు, ఇతర పర్యటనలకు దూరంగా ఉంటుంటారు. ఇటువంటి ఇబ్బంది తమకు ఎదురు కాకూడదు అన్న ఉద్దేశంతోనే ముత్తు కుమార్ స్నేహితులు పెళ్లికి ముందే ఆమె భార్యతో ఒప్పందాన్ని చేసుకున్నారు. 10 ఏళ్లకుపైగా వీరంతా ఆప్త మిత్రులుగా కొనసాగుతున్నారు. పెళ్లి తరువాత ముత్తు కుమార్ ఎక్కడ దూరంగా వెళ్లిపోతాడు అన్న భయంతోనే ఇలా చేసినట్లు కొందరు చెబుతుండగా, పెళ్లిలో భిన్నంగా ఉండే ఉద్దేశంతోనే ఈ బాండ్ వ్యవహారాన్ని తీసుకువచ్చారంటూ మరికొందరు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ బాండ్ పేపర్ పై సంతకం వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. రానున్న రోజుల్లో ఇదే తరహాలో స్నేహితులు చేసే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు.