ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 16 వేలకు పైగా పోస్టులతో మెగా డీఎస్సీని ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నిరుపేద అభ్యర్థులకు ఉచితంగా శిక్షణను ప్రభుత్వం అందిస్తోంది. ఈ క్రమంలోనే డీఎస్సీ అభ్యర్థులకు మేలు చేకూర్చేందుకు మరో కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఉచిత డీఎస్సీ కోచింగ్ పొందేలా ప్రత్యేక ఏర్పాట్లను ప్రభుత్వం చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆచార్య యాప్ ను ప్రారంభించారు.
ప్రతీకాత్మక చిత్రం
ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 16 వేలకు పైగా పోస్టులతో మెగా డీఎస్సీని ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నిరుపేద అభ్యర్థులకు ఉచితంగా శిక్షణను ప్రభుత్వం అందిస్తోంది. ఈ క్రమంలోనే డీఎస్సీ అభ్యర్థులకు మేలు చేకూర్చేందుకు మరో కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఉచిత డీఎస్సీ కోచింగ్ పొందేలా ప్రత్యేక ఏర్పాట్లను ప్రభుత్వం చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆచార్య యాప్ ను ప్రారంభించారు. బీసీ స్టడీ సర్కిల్ ద్వారా బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఆన్లైన్లో ఉచితంగా డీఎస్సీ కోచింగ్ ఈ యాప్ ద్వారా అందించనున్నారు. ఈ యాప్ ను శ్యామ్ ఇన్స్టిట్యూట్ ద్వారా రూపొందించారు. 24 గంటల పాటు ఉచిత శిక్షణ ఉంటుంది. ఆచార్య సేవలను డీఎస్సీ అభ్యర్థులు ఉపయోగించుకోవాలని మంత్రి కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆఫ్ లైన్ కోచింగ్కు ఎక్కువ మంది వెళ్లలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే సుదూర ప్రాంతాలవాసులతోపాటు ఇతరులకు లబ్ధి చేకూర్చేలా ఆన్లైన్ కోచింగ్ను ఈ యాప్ ద్వారా ప్రారంభించారు. దరఖాస్తు చేసుకున్న బీసీ, ఎస్సీ, ఎస్పీ అభ్యర్థులందరికీ ఉచితంగా కోచింగ్ అందించనున్నారు.
ప్రస్తుతానికి 3,189 మంది దరఖాస్తులు చేసుకున్నారు. మరింత మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ యాప్ ద్వారా కోచింగ్ అందించనున్నారు. అర్థం కాని కాన్సెప్ట్లను అభ్యర్థులు ఎన్నిసార్లు అయినా ఓపెన్ చేయవచ్చు. మెటీరియల్ను ఉపయోగించుకోవచ్చు. యాప్ లో సీనియర్ అద్యాపకుల బోధనలు, సబ్జెక్టులకు చెందిన మెటీరియల్, పాత డీఎస్సీ క్వశ్చన్ పేపర్లు అందుబాటులో ఉంటాయి. యాప్ చార్ట్ బాక్స్ రూపొందించామని, అందులో సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలు రైతు చేస్తే తక్షణమే సిబ్బంది సమాధానాలు ఇస్తారని అధికారులు వెల్లడిస్తున్నారు. ఒకవేళ యాప్ లో టెక్నికల్ సమస్యలు వచ్చిన పరిష్కారం అయ్యేలా టీం ని రెడీ చేసినట్లు వెల్లడించారు. ప్రతి జిల్లాకు ఇద్దరిని ఈ మేరకు సిబ్బందిని నియమించారు. ఆ ఇద్దరితో వాట్సాప్ గ్రూప్ రూపొందించారు. టెక్నికల్ సమస్యలు ఉంటే ఆ గ్రూపులో ప్రస్తావిస్తే వారు పరిష్కరిస్తారని మంత్రి వెల్లడించారు. అధికారంలోకి రాగానే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని గతంలో టిడిపి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు ఈ డీఎస్సీ నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేసింది. అలాగే డీఎస్సీ అభ్యర్థులకు ఉచితంగా బీసీ, ఎస్సీ, మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా ఉచితంగా శిక్షణను అందిస్తున్నారు.