తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చే దివ్యాంగులు, వృద్ధుల కోసం టిటిడి అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి లక్షల మంది భక్తులు వస్తుంటారు. వీరులో వృద్ధులు, దివ్యాంగులు కూడా భారీ సంఖ్యలో ఉంటున్నారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చే దివ్యాంగులు, వృద్ధుల కోసం టిటిడి అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి లక్షల మంది భక్తులు వస్తుంటారు. వీరులో వృద్ధులు, దివ్యాంగులు కూడా భారీ సంఖ్యలో ఉంటున్నారు. భారీగా వస్తున్న భక్తులతో స్వామివారి దర్శనం చేసుకోవడంలో దివ్యాంగులు వృద్ధులకు, ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ నేపథ్యంలో వీరికి ప్రత్యేకంగా దర్శనం కల్పించే విషయంపై టిటిడి అధికారులు దృష్టి సారించారు. అందులో భాగంగానే ప్రతిరోజు అంటే సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం మూడు గంటలకు టిటిడి ప్రత్యేక స్లాట్ ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. ఈ సమయంలో ఇతర క్యూలు నిలిపివేసి వృద్ధులు, దివ్యాంగులకు నేరుగా ఉచిత దర్శనం కల్పించనున్నారు. ఇందుకోసం టీటీడీ వెబ్సైట్లో టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 65 ఏళ్లు వయసున్న వారు, హార్ట్ సర్జరీ అయిన వారు, కిడ్నీ ఫెయిల్యూర్ తో బాధపడే రోగులు, క్యాన్సర్, పక్షవాతం, ఆస్తమా వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది వర్తించనుంది. ఇందుకు సంబంధించిన ఆధార్ కార్డు, మెడికల్ సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుంది. అనంతరం వీరికి ప్రత్యేక దర్శనం అవకాశాన్ని టిటిడి అధికారులు కల్పించనున్నారు.