బిజెపిలోకి మాజీ ఎంపీ కేశినేని నాని.. కూటమి పార్టీలు అంగీకరించేనా.!

ఏపీలో కూటమి పార్టీలు వైసీపీకి చెందిన ముఖ్య నాయకులు చేర్చుకునే విషయంలో పోటీపడుతున్నాయి. ఒకవైపు టిడిపి వైసిపి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటుంటే.. మరోవైపు జనసేన కూడా ఇదే బాటలో నడుస్తోంది. ఇప్పటికే ఎంతోమంది వైసిపి ముఖ్య నాయకులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. మరి కొంతమంది జనసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. కూటమిలోని రెండు పార్టీలు వైసీపీకి చెందిన ముఖ్య నాయకులను చేర్చుకునే విషయంలో స్పీడ్ గా ఉంటే.. బిజెపి మాత్రం ఈ విషయంలో కొంత వెనకబడింది అని చెప్పవచ్చు.

Former MP Kesineni Nani

మాజీ ఎంపీ కేశినేని నాని

ఏపీలో కూటమి పార్టీలు వైసీపీకి చెందిన ముఖ్య నాయకులు చేర్చుకునే విషయంలో పోటీపడుతున్నాయి. ఒకవైపు టిడిపి వైసిపి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటుంటే.. మరోవైపు జనసేన కూడా ఇదే బాటలో నడుస్తోంది. ఇప్పటికే ఎంతోమంది వైసిపి ముఖ్య నాయకులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. మరి కొంతమంది జనసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. కూటమిలోని రెండు పార్టీలు వైసీపీకి చెందిన ముఖ్య నాయకులను చేర్చుకునే విషయంలో స్పీడ్ గా ఉంటే.. బిజెపి మాత్రం ఈ విషయంలో కొంత వెనకబడింది అని చెప్పవచ్చు. అయితే తాజాగా బిజెపి కూడా ఆపరేషన్ వైసిపి పేరుతో ముఖ్య నాయకులకు గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కీలకంగా ఉన్న ముఖ్య నాయకులను బిజెపిలో చేర్చుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నానిని పార్టీలో చేర్చుకునేందుకు బిజెపి సిద్దమవుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే నాని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరితోపాటు కేంద్ర మంత్రి నితిన్ గట్కరి ద్వారా సంప్రదింపులు జరిపినట్లు చెబుతున్నారు.

ఇప్పటికే బీజేపీ నాయకులు నుంచి ఈ చీరకకు ఆమోదం లభించినట్లు చెబుతున్నారు. అయితే నాని బిజెపిలో చేరుకుని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొంత ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. 2014, 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున విజయవాడ ఎంపీగా నాని విజయం సాధించారు. అయితే అనివార్య కారణాలవల్ల ఆ పార్టీతో విభేదించి వైసీపీలో చేరి 2024 ఎన్నికల్లో పోటీ చేశారు. ఎన్నికల్లో తన సోదరుడు కేశినేని చిన్ని చేతిలో వాటిని పాలయ్యారు. అప్పటినుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న నాని మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఆయన బిజెపిలో చేరి మళ్ళీ రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. అయితే బిజెపి నుంచి గ్రీన్ సిగ్నల్ పొత్తులో భాగంగా ఉన్న పార్టీలకు విషయాన్ని తెలియజేసేందుకు బిజెపి నాయకులు చెబుతున్నారు. ఇందుకు తెలుగుదేశం పార్టీ ఎంత వరకు అంగీకరిస్తుందో చూడాల్సి ఉంది. కేశినేని నాని వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ సీరియస్గా ఉంది. కేసుల నుంచి తప్పించుకునేందుకు, అధికారాన్ని చలాయించేందుకు నాని బిజెపిలో చేరుతున్నారని ఆ పార్టీకి చెందిన నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత ఎంత వరకు నాని చేరికకు సుముఖత వ్యక్తం చేస్తారు అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. టిడిపి అభ్యంతరం చెబితే చేరుకుని బిజెపి నాయకులు నిలిపివేస్తారా.? పార్టీని బలోపేతం చేసుకునే దిశగా చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా నానితోపాటు మరి కొంతమంది వైసీపీ నాయకులు బిజెపిలో చేరిక వ్యవహారం కూటమిలో అగ్గి రాజేసే అవకాశం ఉందని చెబుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్