రూటు మార్చిన మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ వర్మ .. ప్రజలే నా బలం అంటూ కొత్త రాగం.!

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ వర్మ రూటు మార్చారా అంటే అవునన్నా సమాధానమే రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. పిఠాపురం నియోజకవర్గంలో తనకంటూ బలం, బలగాన్ని ఏర్పరచుకున్న వర్మ 2024 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేశారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సీటు ఇచ్చేందుకు నిరాకరించడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించిన వర్మ.. 2019 ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలయ్యారు. 2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు వర్మ అన్ని ఏర్పాట్లు చేసుకున్న తరుణంలో.. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆయనను పిలిచి పవన్ కళ్యాణ్ కు సీటు ఇస్తున్నామని, నీకు అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం మొదట విడతగా వచ్చే ఎమ్మెల్సీ స్థానాన్ని వర్మకు కేటాయిస్తామని చంద్రబాబు నాయుడు అప్పట్లో చెప్పారు.

Pawan Kalyan, NVS Varma

పవన్ కళ్యాణ్, ఎన్వీఎస్ వర్మ 

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ వర్మ రూటు మార్చారా అంటే అవునన్నా సమాధానమే రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. పిఠాపురం నియోజకవర్గంలో తనకంటూ బలం, బలగాన్ని ఏర్పరచుకున్న వర్మ 2024 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేశారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సీటు ఇచ్చేందుకు నిరాకరించడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించిన వర్మ.. 2019 ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలయ్యారు. 2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు వర్మ అన్ని ఏర్పాట్లు చేసుకున్న తరుణంలో.. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆయనను పిలిచి పవన్ కళ్యాణ్ కు సీటు ఇస్తున్నామని, నీకు అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం మొదట విడతగా వచ్చే ఎమ్మెల్సీ స్థానాన్ని వర్మకు కేటాయిస్తామని చంద్రబాబు నాయుడు అప్పట్లో చెప్పారు. అయితే ఏడాది దాటుతున్న వర్మకు మాత్రం ఎమ్మెల్సీ సీటు ఇవ్వలేదు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు ఎమ్మెల్సీ సీటును ఖరారు చేశారు. ఒకవైపు వర్మను పక్కన పెడుతున్నట్టు కనిపిస్తోంది. మరోవైపు జనసేన నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కూడా వర్మను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కొద్దిరోజుల కిందట పిఠాపురం నియోజకవర్గంలో జనసేన ఆవిర్భావ సభ జరిగింది. ఈ సభలో మెగా బ్రదర్ నాగబాబు వారు మన ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గెలుపు ఎవరి దయాదాక్షిన్యాలు మీద ఆధారపడి లేదంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు మాజీ ఎమ్మెల్యే వర్మను ఉద్దేశించి చేసినవుగా అంత భావిస్తూ వస్తున్నారు. వర్మ దృష్టికి కూడా ఈ వ్యాఖ్యలు చేరడంతో ఆయన కూడా ఘాటు గాని స్పందించారు. తాను లోకల్ అంటూ సరికొత్త రాగానే అందిపుచ్చుకున్నాడు. ఎవరెవరు వస్తుంటారు, వెళుతుంటారని తాను మాత్రం ఇక్కడే ఉంటానని చెబుతున్నారు. ఈమధ్య ప్రజలే నా బలం అంటూ ఆయన సరికొత్త రాగానే అందుకున్నారు. దీని వెనుక ఉన్న కారణం ఏమిటి అన్న ప్రశ్నలు సర్వత్రా ఉత్పన్నమవుతున్నాయి. 

సీటు దూరం కావడానికి జనసేన కారణమా.?

శాసనమండలి సీటు వర్మకు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధపడినప్పటికీ జనసేన అడ్డు చెప్పడంతోనే ఆయన వెనక్కి తగ్గినట్లు వర్మ భావిస్తున్నారు. వర్మ కు ఎమ్మెల్సీ స్థానం ఇస్తే ఇక్కడ రెండో పవర్ పాయింట్ ఎదుగుతుందన్న ఉద్దేశంతోనే వర్మకు ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కనీయకుండా చేశారన్న భావన ఆయనలో ఉంది. ఈ నేపథ్యంలోనే వర్మ రూట్ మార్చి రాజకీయం చేస్తున్నట్లు చెబుతున్నారు. అయినప్పటికీ వర్మ మాత్రం దూకుడుగానే ముందుకు వెళుతున్నారు. టిడిపి, జనసేన ఎవరి రాజకీయాలను వారు చేసుకుంటూనే ముందుకు వెళుతున్నారు. పదవులు వస్తుంటాయి.. పోతుంటాయని, వదిలే తన బలం తన విషయాన్ని చెబుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ఎత్తుగడ పై గొప్పతనం పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆయన మనసులో భవిష్యత్తు ప్రణాళికలు ఉండే ఉంటాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఆయన ఏ కీలక నిర్ణయం తీసుకోకపోయినా భవిష్యత్తులో మాత్రం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. పార్టీ అగ్ర నాయకత్వానికి తన ఉద్దేశాన్ని చెప్పాలన్న ఉద్దేశంతోనే ఆయన సామాజిక మాధ్యమాల్లో ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారన్న విశ్లేషణలు ఉన్నాయి. పార్టీని పట్టుకొని ఉంటే మరి నిర్లక్ష్యం చేయడం పట్ల వర్మ అభిమానులు కూడా తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం అండగా ఉండే నేతలను మరింత నిర్లక్ష్యం చేయడం వల్ల పార్టీ దెబ్బతింటుందన్న భావనను ఆయన అనుచరులు వ్యక్తం చేస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్